EPAPER

MLA Balayya: సీఎం చంద్రబాబుకు బాలయ్య విజ్ఞప్తి.. ఆయన స్పందించేనా?

MLA Balayya: సీఎం చంద్రబాబుకు బాలయ్య విజ్ఞప్తి.. ఆయన స్పందించేనా?

MLA Balayya Comments about Hindupuram: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినిమా హీరో బాలకృష్ణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా ఆ వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు స్పందిస్తారా లేదా? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్లను ఆయన రెండు చోట్ల ప్రారంభించారు. స్వయంగా ఆయనే పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


‘ఏపీలో అన్న క్యాంటీన్లను పున:ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రానున్న రోజుల్లో మరిన్నింటిని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు.

Also Read: జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్.. రెడ్ బుక్ డీటేల్స్ బయటకు..


హిందూపురం అంటే చంద్రబాబుకు ఎనలేని అభిమానం. అందుకే హిందూపురం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.90 కోట్ల నిధులను మంజూరు చేస్తారు. అంతేకాదు.. భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులను మంజూరు చేస్తారనే నమ్మకం నాకు బలంగా ఉంది. ఇటు పారిశ్రామిక క్లస్టర్లను సైతం హిందూపురంలో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అభివృద్ధి పరంగా హిందూపురం ముందంజలో ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేమంటే.. జిల్లాకు సత్యసాయి పేరును అలానే ఉంచి.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరుతున్నాను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం పది జిల్లాలున్న రాష్ట్రంలో మరిన్ని జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ జిల్లా పరిధిలోకే వస్తుంది హిందూపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం, గతంలో కూడా ఈయన ప్రాతినిథ్యం వహించారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వానికి ఇదే విషయాన్ని గుర్తుచేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలంటూ ఆయన గత వైసీపీ సర్కారుకు పలు మార్లు రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ తరువాత పలు సందర్భాల్లో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చారు.

Also Read: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ, విస్తరణ ప్రణాళిక..

అయితే, వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. కాగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయన డిమాండ్ నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా, అటు బంధుత్వం.. ఇలా ఏ రకంగా చూసినా కూడా బలకృష్ణ డిమాండ్ నెరవేరే అవకాశం లేకపోలేదంటున్నారు. పైగా హిందూపురం అంటే చంద్రబాబుకు అత్యంత ప్రీతి.. ప్రత్యేకంగా నిధులు తప్పకుండా కేటాయిస్తారంటూ ఆయనే స్వయంగా నొక్కి చెబుతున్నారు. సో.. కచ్చితంగా బాలకృష్ణ డిమాండ్ ను సీఎం చంద్రబాబు పరిగణలోనికి తీసుకుంటారని, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న బాలకృష్ణ కల నెరవేరుతదని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. చూడాలి మరి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కల నెరవేరుతుందా లేదా? అనేది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×