EPAPER
Kirrak Couples Episode 1

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

MLA Adimulam case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్‌లో ఏం జరిగింది? బాధితురాలు రాజీ పడిందా? భారీగా ముడుపులు అందాయా? ఇవే ప్రశ్నలు చాలామంది నేతలను వెంటాడుతున్నాయి. తాజాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యాయి. దీనిపై తదుపరి ఉత్తర్వులు ఈనెల 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.


సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కేవీబీ పురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేగింది. బాధితురాలు మీడియా ముందుకు వచ్చిన రెండు గంటల వ్యవధిలోపే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ వెల్లడించింది.

ఈ వ్యవహారంపై బాధిత మహిళ తిరుపతి పోలీసుస్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేపై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్‌ 64( అత్యాచారానికి  శిక్ష), 351(2) (నేరపూర్వక బెదిరింపు) కింద తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు, పరీక్షలకు ముఖం చాటేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు ఆమెతో రాజీ ప్రయత్నాలు చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ సమయంలో వైద్య పరీక్షలకు అంగీకరించింది.


ఇదే సమయంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేయడమేమిటని ఆదిమూలం తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో బాధితురాలు ఇంప్లీడ్ అయ్యారు.

ALSO READ:  బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని బాధిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం సైతం బాధిత మహిళతో మాట్లాడింది. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్ వేశానని, ఎమ్మెల్యేపై నమోదు చేసిన అభియోగాలు తప్పుడువని, దాన్ని కొట్టివేయాలని వివరించిందామె.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. ఇరువురు తరపు లాయర్లు, తమ క్లయింట్లు ఇద్దరు రాజీకి వచ్చారని తెలపడంతో పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది కోర్టు. దీంతో ఈ కేసు ఈనెల 25కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Related News

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Big Stories

×