EPAPER

Minister Roja News: నాలుగున్నరేళ్లలో మంత్రి రోజా అనేక అక్రమాలకు పాల్పడ్డారు : బీజేపీ

Minister Roja | కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకే ప్రతిపక్ష నాయకులను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలతో టార్గెట్ చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Minister Roja News:  నాలుగున్నరేళ్లలో మంత్రి రోజా అనేక అక్రమాలకు పాల్పడ్డారు : బీజేపీ
ap political news

Minister Roja Latest News(AP political news):

కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకే ప్రతిపక్ష నాయకులను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలతో టార్గెట్ చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మంత్రి రోజా, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం అన్యాయమని ఆయన న్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి, మంత్రి రోజాలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిపోయి ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం దారుణమన్నారు.

జగన్, వైసీపీ నేతలకు పురంధేశ్వరి అడిగిన ప్రశ్నల వల్ల వెన్నులో వణుకు పుడుతోందని భాను ప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు భయంతో బ్యాలెన్స్ తప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మంత్రి రోజా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు మంత్రి రోజా వెనకేసుకున్నారని అన్నారు. రోజా ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు సంపాదించి దాచుకున్నారనే డేటా మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద, బీజేపీ వద్ద ఉందని భాను ప్రకాశ్ రెడ్డి చెప్పారు.

2024 ఎన్నికల్లో మంత్రి రోజాకు వైసీపీ టికెట్ లభించేలేదు. ఒకవేళ మంత్రి రోజాకు టికెట్ ఇచ్చినా ఆమె గెలిచే సీన్ లేదన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆ ప్రభుత్వం వైసీపీ అవినీతిని ఎండకడుతుందని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లు, ఓటుకు నోట్లతో గెలవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×