EPAPER

Minister Nara Lokesh: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

Minister Nara Lokesh: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

Minister Nara Lokesh about Tanuku Anna Canteen: ఏపీలో అన్న క్యాంటీన్ నిర్వహణ సరిగ్గా లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు తణుకులోని అన్న క్యాంటీన్ నిర్వహణపై వైసీపీ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేసింది.


ఇందులో తణుకులోని అన్న క్యాంటీన్‌లో ప్లేట్లను మురుగు నీటితో కడుగుతున్నట్లు ఉంది. దీనిపై పేద ప్రజలంటే టీడీపీకి ఎందుకు ఇంత చులకన అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ ట్వీట్‌పై మంత్రి నారా లోకేశ్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.

అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డాడు. క్యాంటీన్లలో రుచితోపాటు శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వైసీపీ కావాలనే తప్పుదోవ పట్టిస్తుందన్నారు.


Also Read: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

అక్కడ స్పష్టంగా చేతులు కడిగే స్థలము అని రాసి ఉన్నా.. బురద చల్లేందుకే కొంతమంది వైసీపీ మూకలు సింకులో అన్నం తినే ప్లేట్లను పడేశారని చెప్పుకొచ్చారు. అడుగడుగునా అపరిశుభ్రమంటూ వైసీపీ వీడియో తీసి పోస్ట్ చేస్తుందని, ఇదంతా ఫేక్ ప్రచారం అని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని, పూర్తిస్థాయిలో ప్రజలకు హైజీన్ ఆహారం, ఆవరణాన్ని అందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, వైసీపీ సైకో చేస్తున్న విష ప్రచారమేనని ఆరోపించారు.

చేతులు కడిగే సింకులో అన్నం తినే ప్లేట్లను వైసీపీ మూకలు పడేస్తే.. వాటిని సిబ్బంది తీస్తున్న సమయంలో వీడియో తీసి ఆ నీటిలోనే ప్లేట్లు కడుగుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్లకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేక విష ప్రచారం చేయాలనే ఉద్దేశంతో సైకో జగన్ బ్యాచ్ ఇలా చేస్తుందని లోకేష్ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, తణుకు అన్న క్యాంటీన్ వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా స్పందించింది. ‘ప్రతి అన్న క్యాంటీన్‌లో వేడి సోప్ నీటిలో, నిత్యం తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారని, చేతులు కడుగు స్థలంలో స్పష్టంగా చేతులు కడుగు స్థలం అని రాసి ఉందని, అలా రాసిన చేతులు కడిగే స్థలంలో అన్నం తిన్న ప్లేట్లు పడేస్తే..సింక్ బ్లాక్ కావడంతోపాటు సిబ్బంది ఇబ్బంది పడుతారు. ఇలా ఆ ప్లేట్లను తీస్తున్న సమయంలో 40 సెకండ్ల పాటు వీడియో తీసి దుష్ప్రచారాని ఒడిగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామన్నారు. పరిశుభ్రతకు, నాణ్యతకు, రుచికి పెట్టింది పేరైన అన్న క్యాంటీన్ల విషయంతో ఫేక్ ప్రచారం మానవత్వం అనిపించుకోదు.’ అంటూ ట్వీట్ చేసింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×