EPAPER

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ మంచి మనసు.. ఐఐటీ విద్యార్థికి భరోసా

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ మంచి మనసు.. ఐఐటీ విద్యార్థికి భరోసా

IIT Student: మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ నిరుపేద కుటుంబంలో నుంచి ఐఐటీ చదువును కలగన్న విద్యార్థికి అండగా నిలబడటానికి ముందుకొచ్చారు. లక్నో ఐఐటీలో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్న విద్యార్థికి సహాయం చేస్తానని ప్రకటించారు. ఫీజును మరిచిపో.. చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ట్విట్టర్ వేదికగా ఈ చర్చంతా జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులతోపాటు నెటిజన్లు కూడా మంత్రి నారా లోకేశ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


పశ్చిమ గోదావరి తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్యకు ఇటీవల ఐఐటీ లక్నోలో సీటు వచ్చింది. కోర్సు ఫీజు రూ. 4 లక్షలు. ఆ ఫీజులు చెల్లించే స్థోమత బసవయ్య కుటుంబానికి లేదు. బసవయ్య తల్లిదండ్రులు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇన్నాళ్లు ఇలా కష్టపడి కొంత పొదుపు చేసి కొడుకు చదువులకు ఖర్చు పెట్టారు. కానీ, ఇప్పుడు కోర్సు ఫీజు లక్షల్లో ఉండటంతో చెల్లించే పరిస్థితి లేకపోయింది. బసవయ్యకు ఇంకా ఉన్నత చదువులు చదవాలనే కోరిక బలంగా ఉన్నది. అప్పటి వరకు కూడా తల్లిదండ్రుల కష్టం చూస్తూ కసిగా చదువుతూ వస్తున్నాడు. ఇప్పుడు కోర్సు ఫీజు అడ్డంకిగా మారడంతో సతమయ్యాడు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్..కారణం ఇదే!


అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఆ కుటుంబానికి తోడుగా బసవయ్య కూడా ట్విట్టర్‌లో ఓ ప్రయత్నం చేశాడు. మంత్రి నారా లోకేశ్ ఇటీవలే ఇలాంటి ఉదారతనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బసవయ్య కూడా ట్విట్టర్‌లో మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేసి.. తన పరిస్థితిని వివరించాడు. తన కుటుంబం చదువుల ఖర్చును భరించే పరిస్థితిలో లేదని, దయచేసి తనకు సహాయం చేయాలని అర్థించాడు. ఇందుకు మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించాడు.

మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. బసవయ్య నువ్వు ఐఐటీ లక్నోలో చదువుతావని హామీ ఇచ్చారు. విద్యార్థి కల నెరవేరుతుందని కూడా స్పష్టం చేశారు. బసవయ్య ఫీజు విషయం తాను చూసుకుంటానని నారా లోకేశ్ మాట ఇచ్చారు. అలాగే.. బసవయ్య శుభాకాంక్షలు కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×