EPAPER

Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Minister Nara lokesh: టీడీపీని తెరవెనుక మంత్రి నారా లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు.. చిన్నబాబుకే పగ్గాలు అప్పగించారా? చీటికి మాటికీ బీజేపీ పెద్దలకు కలవడం వెనుక అదే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


టీడీపీలో మంత్రి నారా లోకేష్ పాత్ర క్రమంగా పెరుగుతోంది. పార్టీతోపాటు ప్రభుత్వ బాధ్యతలు చిన్నబాబుకు సీఎం చంద్రబాబు అప్పగించినట్టు అంతర్గతంగా పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైంది. కీలకమైన విషయాలను నారా లోకేష్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేది దగ్గరుండి గమనిస్తున్నారు సీఎం చంద్రబాబు.

వాజ్‌పేయి హయాంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లేవారు సీఎం చంద్రబాబు. కీలక విషయాల్లో ఎన్డీయే పెద్దలను ఒప్పించేవారు. ఓ వైపు.. మరోవైపు ప్రభుత్వ బాధ్యతలు చూసుకునే వారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీని గమనిస్తే అప్పుడు పరిస్థితి కంటిన్యూ అవుతుందని అంటున్నారు. కాకపోతే చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ తెర వెనుక చక్ర తిప్పుతున్నారని అంటున్నారు.


లేటెస్ట్‌గా ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల సేపు ఇరువురు మధ్య సమావేశం జరిగింది. నేతల మధ్య అంతర్గతంగా ఏం జరిగిందన్న విషయం కాసేపు పక్కనబెడదాం.

ALSO READ: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు? త్వరలోనే కీలక ప్రకటన!

ఏపీని ఆర్థికంగా కీలక స్థానంలో నిలబెట్టేందుకు అమిత్ షా అందిస్తున్న సహకారం మరువలేమని ఎక్స్‌లో రాసుకొచ్చారు మంత్రి నారా లోకేష్. గతంలో అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉండేది. అడిగిన వెంటనే నారా లోకేష్‌కు ఇస్తున్నారు.

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తెర వెనుక ఉండి వ్యవహారాలను నడిపించారు నారా లోకేష్. ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దలతో మాట్లాడేవారు. నారా లోకేష్ దౌత్యం ఫలించింది.. సొంత పార్టీ నేతల్లో నమ్మకం కలిగింది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వ్యవహారాలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారట సీఎం చంద్రబాబు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండో-అమెరికా బిజినెస్ వ్యవహారాలను మంత్రి నారా లోకేష్ స్వయంగా చూసుకున్నారు. నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. తత్తరబాటు లేకుండా ఛానెళ్ల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏపీకి ఏం చెయ్యాలనుకుంటున్నామో అన్నది క్లియర్‌గా చెప్పారు. సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్తే నేషనల్ మీడియా ఆయన చుట్టూ తిరిగేది.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వంతైందన్నది పార్టీ సీనియర్ నేతల మాట.

Related News

Jagan vs Sharmila: జగన్ రాయబారం సక్సెస్! చెల్లికి సగ భాగం ఇచ్చేందుకు ఓకేనా?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు? త్వరలోనే కీలక ప్రకటన!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

JC Diwakar Reddy Biopic : తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?

EX MINISTER RK ROJA : ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

AP CM Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

Big Stories

×