Manda Krishna on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలపై నిప్పు రాజుకుంటోందా.. తాజాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించిన తీరును బట్టి ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు మందకృష్ణ మాదిగకు పవన్ పై ఎందుకంత ఆగ్రహం వచ్చిందో తెలుసుకుందాం.
పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని శాంతిభద్రతల స్థితిగతులపై మాట్లాడారు. అలా మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారలేదని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. అలాగే ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడిన వారిని, కులాల ప్రాతిపదికన శిక్షించకుండా ఆలస్యం చేస్తే, తాను సహించనని పవన్ అన్నారు.
హోంమంత్రిని ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి భాధ్యత వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ విషయం చాలా కీలకమని, ఈ విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించాలన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోం మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. పవన్ కామెంట్స్ కి వైసీపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు. మాజీ మంత్రి రోజా అయితే ఏకంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇలా పవన్ చేసిన కామెంట్స్ పై మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్నారు. ఏదైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకురావాలి గానీ, బహిరంగవేదికలో ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు.
Also Read: Lady Aghori: అఘోరీకి ప్రమాదం పొంచి ఉందా? అందుకే ఆ లాయర్ రక్షణ కోరారా?
హోం మంత్రిని విమర్శించడం అంటే, సీఎం ను విమర్శించినట్లేనని, సామాజిక న్యాయమన్న పవన్ కళ్యాణ్ మాదిగలకు ఏవిధంగా న్యాయం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. పవన్ చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని పవన్ పై మందకృష్ణ ఫైర్ అయ్యారు. మరి ఈ కామెంట్స్ కి జనసేన ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.