EPAPER

Majji Srinivasarao Vs Botsa Satyanarayana : బొత్స మామా మజాకా?.. అల్లుడు శ్రీను ఫసక్కా?

Majji Srinivasarao Vs Botsa Satyanarayana : బొత్స మామా మజాకా?.. అల్లుడు శ్రీను ఫసక్కా?

Majji Srinivasarao Vs Botsa Satyanarayana : ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది?.. ఎవరి హవా నడుస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీ ఆరు విడతలుగా ఇన్జార్జిలుగా ప్రకటించినా.. ఆ జిల్లా నుండి ఒక్క పేరు కూడా కనపడకపోవడానికి కారణాలేంటి ? అక్కడ పార్టీలో ఇంటర్నల్ ఫైటే ఆ పరిస్థితికి కారణమా? ఈ సారైనా చట్టసభల్లోకి అడుగుపెట్టాలన్న ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కల కల్లగానే మిగిలిపోతుందా ? కొత్తగా క్రియేట్ చేసిన ఆ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి అందుకోసమేనా ? ఆయనకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరు ? అసలింతకీ అంతుపట్టని రాజకీయం నడుస్తున్న ఆ జిల్లా ఏది?


రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైసీపీలో కొత్తగా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి పుట్టుకొచ్చింది. ఇంతవరకు ఏ రీజియన్ లో కూడా ఈ పదవి లేదు. కేవలం రీజనల్ కో ఆర్డినేటర్‌లు మాత్రమే ఉన్నారు. ఉత్తరంధ్రలో రీజనల్ కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సపోర్ట్‌గా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుని నియమించారు వైసీపీ అధ్యక్షుడు.

ఇప్పుడు అదే మేటర్ ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఎప్పుడెపుడు చిన్న శ్రీను పేరుని.. విజయనగరం ఎంపి అభ్యర్ధిగా వైసీపీ డిక్లేర్ చేస్తోందా? అని ఎదురు చూస్తే.. ఆయన్ని ఇలా సరికొత్త పదవిని అలంకరించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ చిన్న శ్రీనును డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించడమేంటన్న చర్చ మొదలైంది.


చిన్నశ్రీను విజయనగరం ఎంపీ టికెట్ ఆశిస్తే.. అది లేకుండా చేసి.. ఇలా పార్టీలో అదనపు బాధ్యతలు ఏంటంటూ షాక్ కి గురవుతున్నారు ఆయన వర్గీయులు. అసలు చిన్న శ్రీను విషయంలో ఇలా ఎందుకు జరిగిందా? అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. జడ్పీ టూ ఎంపీ అనుకుంటే పార్టీలో సరికొత్త పదవి కట్టబెట్టారేంటని.. మెదళ్ళు చిట్లిపోయేలా ఆలోచిస్తూ.. ఎవరికి నచ్చిన అనాలసిస్‌లు వారు చేసేస్తున్నారట.

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న శ్రీను ఎంపీగా పోటీలో ఉంటే.. విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపగలరని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీనుని బరిలోకి దించడానికి వైసీపీ పెద్దలు కూడా సిద్దమయ్యారన్న టాక్ వినిపించింది. ఆ క్రమంలోనే ఇంచార్జుల జాబితాలు విడుదల చేసిన ప్రతిసారీ.. చిన్న శ్రీను పేరు ఈ జాబితాలోనైనా వస్తుందా అని జిల్లా వైసీపీ శ్రేణులు ఎదురు చూశాయి. అయితే వైసీపి తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది.

చిన్న శ్రీనుకి ఎంపీ సీటు దక్కకుండా ఆయన మేనమామ, మత్రి బొత్స సత్యనారాయణ చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న శ్రీను పార్లమెంటుకి వెళ్ళకుండా బొత్స అడ్డుకుంటున్నారని స్వయంగా కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్నారట. చిన్న శ్రీనుని రాజకీయంగా అణగదొక్కలనే ఉద్దేశ్యంతోనే బొత్స కుట్రలు చేస్తున్నారని.. ఈ ఎన్నికల్లో బొత్స అవసరం ఎక్కువగా ఉండడంతో అధిష్టానం కూడా ఆయన మాటకే ప్రయారిటీ ఇస్తోందన్న టాక్ వినిపిస్తోంది.

చీపురుపల్లి , ఎచ్చెర్ల స్థానలలో ఏదో ఒకటి తనకి కేటాయించాలని ఎంపీ బెల్లాన పట్టుబట్టడంతో.. ఇవన్నీ కాకుండా చిన్న శ్రీను స్థానంలో మళ్ళీ ఎంపి టిక్కెట్ బెల్లానకి దక్కేలా బొత్స చక్రం తిప్పారంటున్నారు. చీపురుపల్లిలో ప్రభావం చూపగల బెల్లాన తన ఓటమికి కారణమవుతారన్న భయంతో బెల్లానకి బొత్స లైన్ క్లియర్ చేసినట్లు చర్చ నడుస్తోంది.

అయితే మామ బొత్స ఎత్తులు , పై ఎత్తులను అల్లుడు చిన్న శ్రీను కూడా నిశితంగా గమనిస్తున్నారట. అందుకే ఎంపి గా పోటీ చేయమని స్వయానా అధినేత జగనే కోరినా పూర్తి సంసిద్దత వ్యక్తం చేయలేదట. సమయం ఉంది కదా అంటూ నాన్చుడు ధోరణి కనబర్చారంట. ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలవకపోతే ? ఉన్న జడ్పీ చైర్మన్ పదవికి బొత్స ఎక్కడ ఎర్త్ పెడతారో అన్న అనుమానంతో.. రెండిటికి చెడ్డ రెవడిలా మారకూడదని ఆచి తూచి అడుగులు వేశారంటున్నారు.

అందుకే ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేసి తన సత్తా ఎంటో నిరూపొంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారట చిన్నశ్రీను.. అంతేకాదు అన్ని అనుకున్నట్లు జరిగితే , వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో రాణిస్తే .. ఆ తర్వాత బొత్సను రాజ్యసభకి పంపించి చీపురుపల్లిని చిన్న శ్రీనుకి కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఏదేమైనా మామ అల్లుళ్ల ఎత్తులు , పై ఎత్తులు చూస్తున్న విజయనగరం జిల్లా వాసులు మాత్రం అసలు సిసలైన రాజకీయాలను ఆస్వాదిస్తున్నారు. అసలు సీటుకే ఎసరు అనుకున్న బెల్లానకి మామ అల్లుళ్ల ఇంటి పోరుతో మరోసారి ఎంపిగా పోటీ చేసే అవకాశం వచ్చిందంటున్నారు. మరి ఆ మామా అల్లుల్లలో ఎవరి ఎత్తుకు ఎవరు చిత్తవుతారో? లేక ఇద్దరూ కలిసి ప్రత్యర్ధులకి పావులుగా మారుతారో చూడాలి.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×