EPAPER

Ongole : ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా ఘటన.. గిరిజన యువకుడిని కొట్టి మూత్రం పోసిన స్నేహితులు..

Ongole : ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా ఘటన.. గిరిజన యువకుడిని కొట్టి మూత్రం పోసిన స్నేహితులు..
Ongole incident latest telugu

Ongole incident latest telugu(AP news live) : ఒంగోలులో అమానుషం ఘటన వెలుగు చూసింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గిరిజన యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి నోటిలో మూత్రం పోసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.


మందు తాగిన మైకంలో బాధిత యువకుడిపై తొమ్మిది మంది కలిసి దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. వదిలేయాలని ప్రాధేయపడ్డా విడిచిపెట్టలేదు. అతని నోట్లో మూత్రం పోశారు. ఇంకా చెప్పలేని రాయలేని పనుల చాలానే చేశారు. బాధితుడు ఎంత మొరపెట్టుకున్నా వాళ్లు మాత్రం కనికరించలేదు. ఈ పైశాచికత్వాన్ని కొందరు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. కానీ వారిలో ఎవర్నీ అరెస్టు చేయలేదు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం నమోదు చేశారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిపై మూత్రం పోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అక్కడి ముఖ్యమంత్రే స్పందించాల్సి వచ్చింది. బాధితుడికి సీఎం కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పారు.


Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×