EPAPER

Duvvada Vani Vs Madhuri: నా భర్తతో విడిపోతా.. శ్రీను నేను కలిసి ఈ ఇంట్లోనే.. మాధురి షాకింగ్ కామెంట్స్

Duvvada Vani Vs Madhuri: నా భర్తతో విడిపోతా.. శ్రీను నేను కలిసి ఈ ఇంట్లోనే.. మాధురి షాకింగ్ కామెంట్స్

Madhuri Clarity On Duvvada Srinivas Relationship: దువ్వాడ శ్రీను, వాణి.. మధ్యలో మాధురి. ఇది నెవర్ ఎండింగ్ ఎపిసోడ్‌లా కనిపిస్తోంది. వినాయకచవితి పర్వదినం రోజున ఈ కథలో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ఏ ఇంటి కోసమైతే వాణి పోరాడుతుందో.. ఆ ఇంటిని మాధురి పేరు మీదకు మార్చేశాడు దువ్వాడ శ్రీనివాస్. ఇంతకీ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా జరిగిందా? పక్కా ప్లాన్‌ ప్రకారమే పేరు ఇంట్లో ప్రియురాలు, వీధిలో ఇల్లాలు ఇదెక్కడి చిత్రం.. ఇది దువ్వాడ ఫ్యామిలీ విచిత్ర కహానీ.. అవును.. పండగ సమయంలో దువ్వాడ ఇంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మాధురి వైల్డ్ కార్డు ఎంట్రీ ఒక ట్విస్ట్ అయితే.. అంతకు మించిన ట్విస్ట్ మరొకటి ఇచ్చింది మాధురి. ఆమె ట్విస్టుకు వాణి నోరెళ్లబెట్టింది.


మొన్నటి వరకు రచ్చకెక్కిన కుటుంబవ్యవహారం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగింది లే అనుకుంటే.. సరిగ్గా పండగ రోజు మళ్లీ రచ్చకెక్కింది. కామ్ గా ఉన్న ఇంట్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్వెల మాధురి. ఎప్పుడొచ్చిందో.. ఎంటో తెలియదు.. కానీ ఆమె వచ్చేసింది. ఈ మ్యాటర్ తెలిసిన పత్ని ఊరుకుంటుందా.. పిల్లలు, బంధువర్గాన్ని వేసుకుని దువ్వాడ శ్రీను ఇంటి ముందు ల్యాండ్ అయింది. ఇక దువ్వాడ ఇంటి ముందు సీన్ రచ్చరచ్చగా మారింది.

గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి. భార్య, పిల్లలు ఇంటి బయట ఉన్నా ఏనాడు ఎవ్వరిని ఇంట్లోకి ఎంట్రి అవ్వనివ్వలేదు శ్రీను.. కానీ ఇప్పుడు మాధురి మాత్రం డైరెక్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో భార్య, పిల్లలు కోపంతో రగిలిపోతున్నారు. శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్వెల మాధురి అటు, ఇటు తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి, ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. బంధువులు, పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది దువ్వాడ వాణి.. ఆమెను ఆపడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఇల్లు తమదని.. దివ్వెల మాధురి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. అయితే ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ చెబుతోంది వాణి.


కానీ వాణి దూకుడుకు పెద్ద ట్విస్టే ఇచ్చింది మాధురి. ఈ ఇల్లు నాదని.. అల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పుకొచ్చింది. దీంతో వాణి మైండ్ బ్లాక్ అయింది. వాస్తవానికి ఆ ఇంటిపైనే ఇంతకాలంగా వివాదం నెలకొంది. ఆ ఇంట్లోకి రానివ్వాలంటూ బయట షెడ్‌లోనే వాణి మకాం వేసింది. ఆ ఇంటి కోసం శ్రీనుకు 2 కోట్లు అప్పు ఇచ్చానని మాధురి చెబుతోంది. ఇంటిని పూర్తిగా మాధురికి రాసి ఇవ్వడంతో వాణి అవాక్కైంది.

Also Read: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

నిజానికి నెల రోజులుగా ఇంట్లో ఎంట్రీ కోసం వాణి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే తనను ఇంట్లోకి అనుమతించాలని వాణి కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 5న టెక్కలి కోర్టు వాణి ఎంట్రీకి ఓకె చెప్పింది. దీంతో కోర్టు తీర్పు వచ్చిన రోజే దువ్వాడ శ్రీను సస్సెషన్ డెసిషన్ తీసుకున్నారు. అదే ఇంటిని మాధురి పేరు మీదుకి మార్చడం.. శుక్రవారం రోజే రిజిస్ట్రేషన్‌ పూర్తి అయింది. అదే రోజు దువ్వాడ శ్రీను ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వాణిపై ముందస్తుగా మాధురి కేసు ఫైల్ చేయడం జరిగిపోయాయి. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు మాధురి. శుక్రవారం ఆమె టెక్కలి పోలీసులకు లెటర్ ఇచ్చారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మాధురి. మొత్తానికి ఏ ఇంటి కోసమైతే ఇంటి వ్యవహారం రచ్చకెక్కిందో.. అదే ఇల్లు ఇప్పుడు ప్రియురాలికి ట్రాన్ఫర్ అయింది. మరి ఈ వ్యవహారం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా.. లేకపోతే వాణి అంతకు మించిన ట్విస్ట్ ఏమైనా ఇస్తుందా అనే తరుణంలో దివ్వెల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనుతోనే ఇకపై కలిసుంటానని.. ప్రస్తుతం లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నామని ఘంటాపథంగా చెప్పేశారు. తనకు, తన భర్తతో కూడా విభేదాలు ఉన్నాయని.. త్వరలో విడిపోతామని స్పష్టం చేశారు. అప్పులు తీర్చే పరిస్థితి లేకే.. మాధురికి తన ఇల్లు రాసిచ్చానని .. దువ్వాడ శ్రీను తెలిపారు.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×