EPAPER
Kirrak Couples Episode 1

AP News: ఏపీ అప్‌డేట్స్.. న్యూస్ రౌండప్..

AP News: ఏపీ అప్‌డేట్స్.. న్యూస్ రౌండప్..

AP News: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల కోసం పలు కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్‌ అధికారులను జనసేన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళన చేస్తున్న పలువురు జనసేన నాయకులను అరెస్టు చేశారు. మరికొందరు నాయకులు స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలో పోలీస్ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించింది. కోచివారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా… ఓ వ్యక్తి దగ్గర 7 లక్షల 40 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిట్వేల్‌కు చెందిన నరేష్‌…సరైన పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

శ్రీకాకుళం లోని కాశీబుగ్గ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయం ఆవరణలో.. వైశ్య సంఘం నేత రమేశ్ కు.. సహచరులు పాలతో అభిషేకం చేశారు. వాస్తవానికి ఆలయాల్లో ఉత్సవమూర్తులకు మాత్రమే అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకు భిన్నంగా ఓ మనిషికి.. అభిషేకం జరగడంపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ నెల 12వ జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు. పాలకొల్లులో ఆయన్ని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంట రహస్య భేటీ తరువాత.. పవన్ కల్యాన్‌తో భేటీ గురించి హరిరామజోగయ్య తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఆర్‌డీఏ అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీతో ధ్వంసం చేశారు. నగర పంచాయతీ చైర్మన్ మండవ వరలక్ష్మి భర్తకు చెందిన లేఅవుట్‌ను కూడా ధ్వంసం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌లు నిర్మించారనే ఫిర్యాదులు రావడంతో వెంచర్‌ను ధ్వంసం చేశామని అధికారులు చెప్పారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు డీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయ కుటుంబంగా గుర్తించారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. రేషన్ పంపిణీ వాహనం సమీపంలోనే దుకాణం ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వీఆర్వో గ్రామంలో తనిఖీలు చేశారు. పీడీఎస్ రైస్ కొనుగోలు చేస్తున్న రేషన్ మాఫియాను పట్టుకున్నారు. వారి నుంచి మూడు రైస్ బ్యాగులు, వేయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గుండెపోట్లు ప్రాణాలు తీస్తున్నాయి. కనీసం నాలుగు పదుల వయసు నిండకుండానే వరుసగా కుప్పకూలిపోతున్నారు.తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ గుండెపోటుతో కన్నుమూశాడు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా..ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. చీరాల మండలం వాకావారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో ఈ విషాదం వెలుగుచూసింది.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి స్వాధీనం కలకలం రేపింది. సందీప్ అనే యువకుడి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. పోలీసులను చూడగానే కిషోర్ అనే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. 12 మంది యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి పరారైన కిషోర్‌కి సంబంధించిందిగా గుర్తించారు.

గుంటూరు జిల్లా జిజిహెచ్ లోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుడు దత్తాత్రేయుడు పరీశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై సమీక్షించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని క్యాన్సర్ సెంటర్లను అప్ గ్రేడ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వే‌స్తోందన్నారు. ఆయుష్మాన్ భవ పథకంలో కవర్ కాని చికిత్సలను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు.

పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్‌‌లో రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జోగారావు ఆయన్ని కలిసి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ తొలగించకుండా స్పష్టమైన హామీ తీసుకున్నారు. టౌన్ రైల్వే స్టేషన్ తొలగింపు అనేది జరగదని, బెల్గాం రైల్వే స్టేషన్ వైశాల్యాన్ని పెంచుతూ మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×