EPAPER

AP Fake Votes Issue: ఏపీలో లక్షలకొద్దీ దొంగ ఓట్లు.. ఎవరి లెక్కలు కరెక్ట్ ?

AP Fake Votes Issue: ఏపీలో లక్షలకొద్దీ దొంగ ఓట్లు.. ఎవరి లెక్కలు కరెక్ట్ ?

AP Fake Votes Issue: ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై ముందు ముందు మరిన్ని ట్విస్టులు ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త ఓట్ల సృష్టి, పాత ఓట్ల తొలగింపుపై రకరకాల వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. వీటికి కర్త, కర్మ, క్రియ ఎవరన్నది ఉన్న తక్కువ సమయంలో కనిపెట్టడం కష్టమే. మరి ఎన్నికల సంఘం దగ్గరున్న మార్గమేంటి? ఈ ఫేక్ ఓటర్లపై టీడీపీ, బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది?


ఇదీ ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లపై లెక్కలు. ఇందులో ఏది కరెక్ట్. ఈసీ చెప్పిందే తీసుకుందాం.. అన్నీ బేరీజు వేసి.. ఉన్న సిబ్బందితో క్రాస్ చెక్ చేసి చెప్పిన లెక్క అది. మూడు నెలల క్రితానికి ముందు లెక్క. మరి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎలక్షన్లు దగ్గరికొస్తున్నా కొద్దీ కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లను చేర్పించారన్నది తాజా అభియోగాలు. సరే ఒకసారి టీడీపీ వెర్షన్ చూద్దాం… గత తిరుపతి బై ఎలక్షన్ సమయంలో దొంగ ఓట్లపై సాక్ష్యాధారాలతో సహా బయపెట్టారు. 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఇది వరకే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కూడా చేశారు. అక్కడ పని జరగకపోవడంతో ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇక వైసీపీ వాళ్లయితే.. ఏకంగా 40 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇందులో ఏది నిజం..? అసలు ఏపీలో ఓటర్ జాబితాలో ఏం జరుగుతోంది?

దొంగ ఓట్లపై రాష్ట్రస్థాయిలో పని జరగడం లేదనుకున్న టీడీపీ.. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వారే ఫిర్యాదు చేయడమేంటని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. తాము కంప్లైంట్ చేయడానికి వస్తున్నామని తెలిసి తమకంటే ముందే వచ్చారని ఫైర్ అవుతున్న పరిస్థితి. తాము ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. “వై ఏపీ నీడ్స్ జగన్” అనే కార్యక్రమం పూర్తిగా పార్టీ సంబంధిత కార్యక్రమం అని, కానీ దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారంటున్నారు. దీనిపైనా ఫిర్యాదు చేశామని టీడీపీ ఎంపీలు చెబుతున్న మాట.


దొంగ ఓట్లపై ఓవైపు వైసీపీ, ఇటు టీడీపీ, బీజేపీ వరుస ఫిర్యాదులు చేయడంతో ఈ నెల 22న ఏపీకి వస్తామని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు చెబుతున్నారు. తప్పు చేసిన వారే తిరిగి కంప్లైంట్ ఇవ్వడంలోనే అసలు మ్యాటర్ ఉందంటున్నారు టీడీపీ నేతలు.

ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై అటు బీజేపీ కూడా సీరియస్ అవుతోంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై కంప్లైంట్ చేశారు. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్ట్ టాంపరింగ్ జరుగుతుందన్న సమాచారంతో సీఈసీని కలిశామని.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35 వేలు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామన్నారు పురంధేశ్వరి. తిరుపతి బై పోల్ లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని.. అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని ఆరోపించారు. విశాఖపట్నం నార్త్‌లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61 వేల మంది ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని.. కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడమే మిగిలింది అంటున్నారు.

ఏపీలో గతకొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైంది పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియే. మరి అలాంటి ప్రక్రియ ఫేక్ ఓట్లతో ప్రభావితమైతే ఉపయోగం లేదు. ఏపీలోని 26 జిల్లాల్లో ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా ఉన్నాయంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓకే ఇంటి నెంబర్‌తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. అదేంటో విచిత్రం.. ఈ వ్యవహారంపై అన్ని పార్టీలూ పోరాటం చేస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియదు.. ఎందుకు చేస్తున్నారో తెలియదు.. దీన్ని కనిపెట్టాలి.

వందేళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో ఎక్కువగా ఉండటంతో అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్, జీరో ఇంటి నెంబర్ పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ ముందుకు జరగడం లేదు. ఇప్పటికీ చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయంటున్నారు. ఏపీలో జీరో డోర్ నంబర్‌తో 4 లక్షల 16 వేల 64 ఇళ్లున్నాయని చెబుతున్నారు. ఈ ఇళ్లల్లో ఓటర్లు భారీగా నమోదయ్యారంటున్నారు.

ఏపీలో 175 నియోజకవర్గాల్లో జీరో డోర్ నంబర్‌తో ఇళ్లున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో 34,664 జీరో నంబర్‌తో ఇళ్లున్నాయన్న విషయం తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జీరో డోర్ తో 25వేల 562 ఇళ్లు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో జీరో డోర్ నంబర్‌తో అసలు ఓట్లు ఎలా చేరుస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు హస్తం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తుంటే.. కాదు కాదు.. టీడీపీ చేసిన పనే ఇది అని తాము చాలా వరకు సవరించామని వైసీపీ అంటోంది. నిజం ఏంటన్నది ఈసీనే తేల్చాలి మరి.

.

.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×