Lady Aghori: తెలంగాణ నుంచి నేరుగా ఏపీకి వెళ్లింది నాగ సాధు అలియాస్ మహిళ అఘోరీ. సోమవారం రాత్రి విశాఖకు చేరింది.నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ సందర్భంగా బీగ్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది అఘోరీ.
హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని మనసులోని మాట బయటపెట్టింది అఘోరీ. ఎన్ని కేసులైనా పెట్టుకోండి తనకు ఏమీ కాదని తెలిపింది. తన శక్తులు తెలుసుకోవాలంటే హిమాలయాలకు వస్తే చూపిస్తానని తెలిపింది.
ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. తాను పవన్‌ను కలవనని, ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పింది.
అంతకుముందు విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద మహిళా అఘోరీ హల్‌చల్ చేసింది. తన పట్ల టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని అఘోరీ ఆరోపించింది. నాగ సాధుకే రక్షణ లేకపోతే, మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ALSO READ: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం
అందుకే కలియుగం ఇలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రెండు గంటల పాటు హైడ్రామా సాగింది. ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అఘోరీకి సరిదిద్ది చెప్పి పంపేశారు. అక్కడి నుంచి విశాఖపట్నానికి ఆమె చేరింది.
ఇంతకీ అఘోరీ ఆలోచన ఏంటి? ఆత్మార్పణం చేసుకుంటానని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నానా హంగామా చేసింది. హిందుత్వాన్ని కాపాడడమే తన లక్ష్యమని లేటెస్ట్‌లో ఏపీలో చెప్పుకొచ్చింది. అఘోరీ వెనుక సూత్రదారులు ఎవరో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.