EPAPER

Kuppam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కుప్పం కింగ్ అతనేనా..?

Kuppam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కుప్పం కింగ్ అతనేనా..?
Kuppam Assembly Constituency

Kuppam Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుప్పం అంటే వెంటనే గుర్తుకువచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 1989 నుంచి వరుసగా 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎనిమిదోసారి పోటీకి సై అంటున్నారు. అందుకే ఆ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత. వైనాట్ 175 అంటున్న ఏపీ సీఎం జగన్… ఈ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. చంద్రబాబు కూడా తన లెగసీని కంటిన్యూ చేసేందుకు… మెజార్టీ పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ సెగ్మెంట్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ ఓవరాల్ గా 1983 నుంచి టీడీపీ గెలుస్తూ వస్తోంది. చెప్పాలంటే కుప్పం టీడీపీ కంచుకోట. ప్రస్తుత ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మరి సమీకరణాలు మారిన ఈ సమయంలో కుప్పం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

చంద్రమౌళి VS చంద్రబాబు నాయుడు


YCP 38%
TDP 55%
OTHERS 7%

కుప్పంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేశారు. ఇక్కడ వన్నెకుల క్షత్రియుల సంఖ్య చాలా ఎక్కువ. చంద్రబాబుకు చెక్ పెడుదామని వైసీపీ వ్యూహాత్మకంగా ఈ సామాజికవర్గం నేతలకు ప్రాధాన్యం పెంచుతూ వస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఛరిష్మా ముందు వైసీపీ అభ్యర్థి విజయం దగ్గరికి కూడా రాలేకపోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి 55 శాతం ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 38 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో కుప్పం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (YCP)

కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ప్లస్ పాయింట్స్

  • జనంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ గా గుర్తింపు
  • కీలకమైన వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం సపోర్ట్
  • జగనన్నతో జనం, భరతన్నతో మనం కార్యక్రమం
  • కుప్పంలో గత కొన్నాళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలు

కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ మైనస్ పాయింట్స్

  • రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోవడం
  • చంద్రబాబు లాంటి పెద్ద నేతను ఢీకొడుతారా అన్న డౌట్లు

చంద్రబాబు (TDP)

చంద్రబాబు నాయుడు ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంతో విడదీయ రాని అనుబంధం
  • గతకొన్ని దశాబ్దాలుగా కుప్పంలో చేస్తున్న అభివృద్ధి
  • కుప్పం ప్రజల్లో పాజిటివ్ సెంటిమెంట్

కుల సమీకరణాలు

వన్నెకుల క్షత్రియ 42%
ఎస్సీ 17%
కురుబ 14%
కమ్మ 4%

కుప్పం నియోజకవర్గంలో కుల సమీకరణాల లెక్కలు రోజురోజుకూ కీలకంగా మారుతున్నాయి. వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం కుప్పంలో ఎక్కువగా ఉంది. అయితే వీరిలో కేవలం 30 శాతం మంది మాత్రమే వైసీపీకి మద్దతుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. నిజానికి వైసీపీ నుంచి ఇదే సామాజికవర్గం నేత బరిలో ఉన్నప్పటికీ మెజార్టీ జనం టీడీపీవైపు చూస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. అటు టీడీపీకి 60 శాతం సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇతరులకు 10 శాతం మద్దతు ఇస్తున్నారు. అటు ఎస్సీల్లో 35 శాతం మంది వైసీపీకి, 55 శాతం మంది టీడీపీకి,10 శాతం ఇతరులకు మద్దతుగా ఉన్నారు. కురుబ వర్గానికి చెందిన వారిలో 30 శాతం వైసీపీకి, 60 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో వెల్లడించారు. ఇక కమ్మ సామాజికవర్గంలో కేవలం 4 శాతం మంది మాత్రమే జగన్ పార్టీకి, ఏకంగా 85 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు అండగా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ VS నారా చంద్రబాబు నాయుడు

YCP 30%
TDP 65%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… కుప్పంలో టీడీపీ గెలిచే స్కోప్ ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ తరపున బరిలో ఉండే చంద్రబాబుకు ఏకంగా 65 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ కు 30 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఇతరులకు 5 శాతం ఓట్లు రానున్నాయి. చంద్రబాబు నాయుడు చరిష్మా, దశాబ్దాల రాజకీయ అనుభవంతో కుప్పం ఆయనకే పట్టం కడుతుందని సర్వేలో తేలింది. ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే అవేవీ భరత్ గెలుపునకు ఉపయోగపబోవని ప్రజా అభిప్రాయంగా బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×