Big Stories

Kotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం..

Kotamreddy : నెల్లూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినాసరే కోటంరెడ్డి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారం తెలియగానే ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిష్కరణకు గురయ్యారు. అంతకుముందు కూడా పార్టీ అధిష్టానంపై , ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదని నిలదీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీతో కోటంరెడ్డికి దూరం పెరిగింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కోటంరెడ్డి ఓటేశారని భావించిన వైసీపీ అధిష్టానం.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తన వాయిస్ ను కోటంరెడ్డి మరింత పెంచారు. తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి నిరసనకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తీరుపై కోటంరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News