EPAPER
Kirrak Couples Episode 1

Komatireddy: శిశుపాలుడిలా కోమటిరెడ్డి వ్యవహారం?.. వంద తప్పులు క్షమిస్తారా?

Komatireddy: శిశుపాలుడిలా కోమటిరెడ్డి వ్యవహారం?.. వంద తప్పులు క్షమిస్తారా?

Komatireddy: ఈ కోమటిరెడ్డి ఉన్నారే.. కాంగ్రెస్‌లో మోస్ట్ కాంట్రవర్సీ లీడర్‌గా మారారు. పదే పదే పార్టీకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి.. వరుసబెట్టి వివాదాలు. కాంగ్రెస్‌లో నిత్య న్యూసెన్స్. ఇంత చేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని క్షమిస్తూనే ఉంది అధిష్టానం. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కోమటిరెడ్డి తప్పుల్ని కాస్తోంది. తనను హైకమాండ్ ఏమీ చేయలేదనే ధీమానో.. మరేంటో కానీ.. వెంకట్ రెడ్డి మళ్లీ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఓ కాంగ్రెస్ లీడర్ ను చంపేస్తానంటూ బెదిరించే వరకూ.. ఆయన అరాచకం దారి తీసింది. కోమటిరెడ్డి ఇష్యూ పీక్స్‌కు చేరింది.


కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు నిఖార్సైన కాంగ్రెస్ లీడర్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చిందో.. అప్పటి నుంచీ నిత్య అసంతృప్త వాదిగా మారారు. అసంతృప్తి వరకే పరిమితమైనా బాగుండేది.. కానీ పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారంటూ అప్పట్లో కలకలం రేపారు. రేవంత్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా.. బీజేపీ నుంచి బరిలో నిలిచిన తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ఆ విషయంలో కోమటిరెడ్డికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. అది ఫేక్ వాయిస్ అంటూ వేటు నుంచి తప్పించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేత కావడంతో.. హైకమాండ్ సైతం కోమటిరెడ్డి విషయంలో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తోంది. ఆ బలహీనతను అడ్డుపెట్టుకుని ఎప్పటికప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు కోమటిరెడ్డి.

ఇటీవల రానున్న ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందని.. సర్వేలు చెబుతున్నాయంటూ మళ్లీ కలకలం రేపారు. కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని అన్నారు. కాంగ్రెస్‌కు తీవ్ర డ్యామేజ్ చేసేలా ఉన్నా ఈ స్టేట్‌మెంట్‌తో మరోసారి రచ్చ నడిచింది. బీజేపీ వాళ్లు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందుదొందేనంటూ వరుసబెట్టి మాటల దాడి చేశారు. చేయాల్సిందంతా చేసి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ పార్టీ ఇంఛార్జ్ థాక్రేకు వివరణ ఇచ్చుకున్నారు. క్రమశిక్షణ చర్యల నుంచి చాలాఈజీగా తప్పించుకున్నారు.


ఇన్ని చేసినా కోమటిరెడ్డి తీరు అసలేమాత్రం మారినట్టు లేదు. లేటెస్ట్‌గా కాంగ్రెస్ లీడర్ చెరుకు సుధాకర్‌ను తన అనుచరులు హత్య చేస్తారంటూ ఆయన కొడుకుకే ఫోన్ చేసి బెదిరించిన ఘటన మరింత సంచలనంగా మారింది. కోమటిరెడ్డి బాగా దిగజారిపోయారని.. హత్యా రాజకీయాలకూ సిద్ధమవుతున్నారంటూ కాంగ్రెస్ కేడర్ మండిపడుతోంది. సొంత పార్టీకే చెందిన నాయకుడిని.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. చంపేస్తారంటూ బెదిరించడం.. మామూలు విషయం మాత్రం కాదు. చెరుకు సుధాకర్ రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. అందుకే, ఆయన్ను లేపేయడానికి కోమటిరెడ్డి ప్లాన్ చేశారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

తన కొడుకుకు ఫోన్ చేసిన తనను చంపేస్తానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించడంపై చెరుకు సుధాకర్.. పార్టీ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రేకు ఫిర్యాదు చేశారు. ఎంపీ కోమటిరెడ్డిపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలని కోరారు. మరి, ఇప్పుడైనా కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందా? వెంకట్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటుందా? లేదంటే, పార్టీకి ఆయన అవసరం ఉందంటూ మళ్లీ ఎప్పటిలానే పట్టించుకోకుండా వదిలేస్తుందా? శిశుపాలుడి వంద తప్పులు శ్రీకృష్ణుడు క్షమించినట్టు.. కోమటిరెడ్డిని హైకమాండ్ మళ్లీ మళ్లీ క్షమించేస్తుందా?

Related News

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Big Stories

×