EPAPER
Kirrak Couples Episode 1

Kodali Nani : రంగాను చంపింది వాళ్లే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani : రంగాను చంపింది వాళ్లే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani : వంగవీటి మోహనరంగా హత్యపై మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. ఆనాడు ఆయనను హత్య చేసిన వారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొడాలి నాని రంగా చిత్రపటానికి నివాళులర్పించారు.


తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాడు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని స్పష్టం చేశారు. రంగా చావుకు టీడీపీనే కారణమని ఆరోపించారు. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారని తెలిపారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితికి టీడీపీ చేరిందని మండిపడ్డారు. వంగవీటి రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారని సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారని కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. రంగా హత్య కేసులో దేవినేని ఉమా, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలని పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్‌ పీకారని తెలిపారు. ఇప్పుడు అదే టీడీపీ రాధా కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. వంగవీటి రంగా కుటుంబంతో తనకు అనుంబంధం ఉందని కొడాలి నాని వివరించారు.


గుడివాడలో తనను ఓడించడం కష్టమని కొడాలి నాని తేల్చిచెప్పారు. గుడివాడ ఓటర్లు తన భవిష్యత్తును నిర్దేశిస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. బాధ్యతతో పనిచేస్తున్నామని అందుకే గెలుస్తున్నామని అన్నారు. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×