EPAPER

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Kethireddy Comments: గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం ద్వారా తన నియోజకవర్గంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కేతిరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


ఆ వీడియోలో కేతిరెడ్డి ఏమన్నారంటే..’తిరుపతి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు, ఇతరులు మాట్లాడుతున్న తీరు సరిగా లేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇదేవిధంగా అనవసర వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్ల గుళ్లను కూల్చివేస్తున్నారంటూ అప్పుడు లేనిపోని నిందలు వేశారు. అటువంటి దుర్మార్గపు పనులు చేయాల్సిన అవసరం జగన్ కు లేదు. చంద్రబాబు అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు.. అధికారంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే కదా ఉంది? వెంటనే లడ్డూ వివాదంపై విచారణ చేసి, మీరంటున్నదే నిజమే అని తెలితే వెంటనే చర్యలు తీసుకోండి. అంతేకానీ, అనవసర వ్యాఖ్యలు చేసి సమయం వేస్ట్ చేయొద్దు. ఇప్పటికైనా అవాస్తవాలు చెప్పడం మానెయ్యు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు తిరుపతికి పోయి.. ఆ దేవుడిని దర్శనం చేసుకుని.. నిజానిజాలేంటో అక్కడికి వెళ్లి నిర్ధారణ చెయ్యు. అప్పుడు నీ గురించి వాళ్లకు తెలిసిపోతుంది.

Also Read: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో


అదేవిధంగా జమిలి ఎన్నికలు వెళ్తే.. జమిలి ఎన్నికల నిర్వహణ కంటే ముందు కేంద్రం మహిళా బిల్లు అమలుపై దృష్టి సారిస్తే బాగుంటుంది. గత ఎలక్షన్ల సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇటు విజయవాడ వరదల విషయంపై మాట్లాడితే.. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీపై బురద రాజకీయాలు చేస్తుంది.  వరద బాధితుల కోసం మేం ఎంత ఖర్చుపెడుతామనేది మా ఇష్టం. అంతే తప్ప మేం మీకు చెప్పాల్సిన అవసరంలేదు. కానీ, మీరు ఎంత ఖర్చుపెట్టారో? ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టారో అనేది అన్ని వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మీరే కదా అధికారంలో ఉన్నారు. ఈ విషయం ముందు తెలుసుకోండి.

కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నది. రెడ్ బుక్ పేరుతో ఏపీలో రాజకీయాలు చేస్తుంది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కావాలనే ఈ విధంగా చేశారు తప్ప మరోకటి కాదు. ఇటువంటి కక్ష రాజకీయాలు మానేయాలి. ఎందుకంటే ఇవాళ మీరు రెడ్ బుక్ పేరు చెప్పి రాజకీయాలు చేస్తే.. రేపు వైసీపీ బ్లూ బుక్ పేరుతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది. ఇటువంటి రాజకీయాలతో మొత్తంగా నష్టపోయేది కేవలం ప్రజలే తప్ప నాయకులు కాదు.

నూతన మద్యం పాలసీ విధానంపై కాదు.. ప్రభుత్వం ముందుగా విద్యపై ఆలోచించాలి. ప్రజలకు అందించాల్సింది మద్యం కాదు.. మంచి విద్య. అనవసరమైన వాటిపైన ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. చదవు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలల్లో క్వాలిటీ స్టడీపై, ఫీజులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయాలి తప్ప మద్యంపై కాదు. వైసీపీ హయాంలో జగన్ విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కార్పొరేట్ లెవల్ లో విద్యను అందించారు. కానీ, ఏ రోజూ కూడా ఆయన ఆ రెండు విషయాల్లో కాంప్రమైజ్ కాలేదు.

Also Read: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

అదేవిధంగా నేను పార్టీ మారుతానంటూ ప్రచారం జరుగుతుంది. అదంతా అబద్ధం. ప్రస్తుతం నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. సమస్యలు వస్తున్నాయని మేం భయపడం.. వెనక్కీ తగ్గేదిలేదు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. భవిష్యత్తులో కూడా ఉండబోదు. మేం ఇప్పటి నుంచి కాదు.. గత 30 ఏళ్ల నుంచి కూడా మా కుటుంబం వైఎస్సార్ కుటుంబంతోనే ఉంది. భవిష్యత్తులో కూడా జగన్ తోనే ఉంటాం. అలాంటి పరిస్థితులు వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటాను తప్ప పార్టీ మారను. ఇవి నాపై కొందరు కావాలనే చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదు. మేం సేవ చేయాలని, మమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం మాత్రమే నేను రాజకీయాలకు వచ్చాను తప్ప. నాకు పదవులు, రాజకీయాలపై మోజుతో నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను అప్పడు.. ఇప్పుడు.. ఎప్పుడూ జగన్ తోనే ఉంటా.

పలువురు ఆఫీసర్లు కూడా రాష్ట్రంలో కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. అది సరికాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి. కానీ, శాశ్వతంగా ఉండాల్సింది మీరే. ఆ విధంగా కాకుండా మీరు సరైన రీతిలో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలి. కానీ, ఎవరి పక్షాన ఉండొద్దు’ అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×