EPAPER

Kanna Laxminarayana : బీజేపీకి కన్నా రాజీనామా..! దారెటు..?

Kanna Laxminarayana : బీజేపీకి కన్నా రాజీనామా..! దారెటు..?

Kanna Laxminarayana : ఏపీలో బీజేపీ బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ పార్టీ విస్తరణకు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. చెప్పుకోదగ్గ నేతలు పార్టీలో లేరు. రాజకీయ కార్యక్రమాలు చురుగ్గా సాగడంలేదు. ఉన్న కొందిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు కాషాయ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా కాషాయ పార్టీలో అగ్గిరాజేసింది.


ఉప్పునిప్పులా..
కొంతకాలంగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు అసలు పడటంలేదు. ఒకరి అభిప్రాయాలను మరొకరు విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలు కన్నా దూరంగా ఉంటున్నారు.

జీవీఎల్ తో విభేదాలు..
మరోవైపు ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కన్నాకు పొసగడంలేదు.జీవీఎల్ ఇప్పటికే పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఏపీలో ఓ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని పార్లమెంట్ వేదికగానే డిమాండ్ చేశారు. దీంతో జీవీఎల్ కు కాపుల్లో ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను విశాఖలో కాపులు సన్మానించారు. ఇలా కాపుల అంశాన్ని జీవీఎల్ ఎత్తుకోవడాన్ని కన్నా సహించలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కాపుల కోసం జీవీఎల్ ఏం చేశారని కన్నా తన అనుచరుల వద్ద ప్రశ్నించారని తెలుస్తోంది. మరోవైపు కన్నా పార్టీ మారడంపై మీడియా ప్రశ్నలకు జీవీఎల్ సమాధానం చెప్పకుండా దండం పెట్టారంటే వారిద్ధరి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో అర్థవుతోంది.


కన్నా దారెటు..?
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరతారని టాక్ వచ్చింది. ఆ తర్వాత జనసేనలోకి వెళుతున్నారని వార్తలు వినిపించాయి. మొత్తంమీద కన్నా పార్టీ మారటం మాత్రం గ్యారంటీ అని చాలాకాలం వినిపిస్తున్న మాటే ఈ నేపథ్యంలో తన అనుచరులతో కన్నా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బీజేపీకి రాజీనామా చేశారు. 2014లో మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో బీజేపీలో చేరానని చెప్పారు. 2018లో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారని..తన పనితీరు నచ్చే చాలామంది బీజేపీలో చేరారని కన్నా తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్నానని చెప్పారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగాలేదని ఆరోపించారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో పరిస్థితులు మారాయన్నారు. జీవీఎల్ వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిణామాల వల్లే తాను పార్టీకి రాజీనామా చేశానని కన్నా స్పష్టం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కన్నా రాజకీయ జీవితం తలక్రిందులైంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. 2018 నుంచి కొంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు అప్పగించింది. దీంతో కన్నా క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇక బీజేపీలో తనకు భవిష్యత్తు లేదనుకున్నారో? లేక బీజేపీకే రాష్ట్రంలో భవిష్యత్తు లేదనుకున్నారో మొత్తంమీద బీజేపీకి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు కన్నా దారెటు..?

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×