EPAPER

Jeedi Nellore | జీడినెల్లూరులో ఎంపీ రెడ్డప్ప కష్టాలు.. చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామి గెలుస్తారా?

Jeedi Nellore | గెలుపు స్లోగన్ ఎత్తుకున్న వైసీపీ .. అభ్యర్ధులను మార్చేస్తోంది . అధినేత జగన్ ఎప్పుడే లిస్ట్ రిలీజ్ చేస్తారో? .. ఏ సిట్టింగ్ ఏ సెగ్మెంట్‌కి షిఫ్ట్ అవుతారో ఆ పార్టీ వారికే అంతుపట్టకుండా తయారైంది. దానికి తోడు ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు, ఎమ్మెల్యేలకు ఎంపీ సెగ్మెంట్లు కేటాయిస్తూ ఉన్న సీటు లేకుండా చేస్తోంది.

Jeedi Nellore | జీడినెల్లూరులో ఎంపీ రెడ్డప్ప కష్టాలు.. చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామి గెలుస్తారా?

Jeedi Nellore | గెలుపు స్లోగన్ ఎత్తుకున్న వైసీపీ .. అభ్యర్ధులను మార్చేస్తోంది . అధినేత జగన్ ఎప్పుడే లిస్ట్ రిలీజ్ చేస్తారో? .. ఏ సిట్టింగ్ ఏ సెగ్మెంట్‌కి షిఫ్ట్ అవుతారో ఆ పార్టీ వారికే అంతుపట్టకుండా తయారైంది. దానికి తోడు ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు, ఎమ్మెల్యేలకు ఎంపీ సెగ్మెంట్లు కేటాయిస్తూ ఉన్న సీటు లేకుండా చేస్తోంది. ఆ క్రమంలో షఫ్లింగ్ పద్దతితో చిత్తూరు ఎంపీ రెడ్డెప్పకి జీడినెల్లూరు ఇన్‌చార్జ్ బాధ్యతలు కట్టబెట్టింది వైసీపీ. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సిఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపి అభ్యర్థి‌గా ప్రకటించింది. అదే జీడినెల్లూరు వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి రేపుతోందంట.


రెడ్డప్ప నాన్‌లోకల్ అవ్వడం. అందులో అక్కడ ఇప్పటికే నారాయణస్వామి వ్యతిరేకవర్గం బలంగా ఉండటంతో .. రెడ్డెప్పకు ఎటూ పాలుపోవడం లేదంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్ బంతాట అడుకుంటున్నారు. ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా .. ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తూ లిస్ట్‌ల మీద లిస్ట్‌లు రిలీజ్ చేస్తున్నారు. మూడో లిస్టులో తిరుపతి ఎంపి గురుమూర్తి ని సత్యవేడు ఎమ్మెల్యే స్థానానికి షిఫ్ట్ చేసి.. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నాలుగో జాబితాలో జీడినెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సిఎం నారాయణస్వామి చిత్తూరు ఎంపీ అభ్యర్థి అయ్యారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్పకి జీడినెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో దిగాల్సి వచ్చింది.


జీడినెల్లూరులో డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని ముందు నుంచి మాజీ ఎంపి జ్ణానేంద్రరెడ్డి వర్గం వ్యతిరేకిస్తుంది. ప్రతి మండలం వైసీపీ శ్రేణుల్లోనూ నారాయణస్వామి వ్యతిరేక వర్గం కనిపిస్తుంటుంది. ఇక జ్ణానేంద్రరెడ్డి నియోజకవర్గంలో తనకంటూ.. సొంత వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు .. ఆయన కూమార్తె కృపాలక్ష్మిని ప్రత్యక్షరాజకీయాల్లోకి తీసుకురావడానికి జగన్‌ వద్దకు రాయబారాలు కూడా నడిపారు.

కనీసం సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ అయినా ఇమ్మని సిఎంను కలసినప్పుడు అడిగారంట. అయితే సత్యవేడుకు తిరుపతి ఎంపీని అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ. మొత్తానికి జ్ణానేంద్రరెడ్డి ఆశిస్తుంది అయితే దక్కలేదు కాని .. డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడినెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్ధిగా షిఫ్ట్ అవ్వడంతో మాజీ ఎంపి జ్ణానేంద్రరెడ్డి వర్గం సంబరాలు చేసుకుంటున్నారంట.

అదలా ఉంటే చిత్తూరు ఎంపిగా గెలవాలంటే జీడి నెల్లూరు ఓట్లు కీలకమంటున్నారు. ఇక్కడున్న సామాజిక సమీకరణాలు వైసీపీకి లాభించే పరిస్థితి ఉంది. సెగ్మెంట్ ఓటర్లు అభ్యర్ధి ఎవరైనా.. పార్టీని చూసి ఓటేస్తారన్న అభిప్రాయం ఉంది . అయితే చిత్తూరు ఎంపి రెడ్డప్పను జీడి నెల్లూరు ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలోని నారాయణస్వామి అనుకూల వర్గం రెడ్డెప్ప వద్దు అంటూ తీర్మానాలు చేయడం మొదలు పెట్టింది.

కార్వేటినగరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు, సర్పంచ్ లు నారాయణస్వామి తమకు అభ్యర్థిగా ఉండాలంటు తీర్మానం కూడా చేశారు . ఆ సమయంలో నారాయణ స్వామి ముద్దు ,మరొకరు వద్దు అంటు నినాదాలు చేశారు.

ఆ క్రమంలో జీడీనెల్లూరుకు కొత్తముఖమైన రెడ్డెప్ప .. తన గెలుపు భారమంతా మంత్రి పెద్దిరెడ్డిపై వేశారంట. పెద్దిరెడ్డి అనుచరుడిగా రాజకీయాలలోకి ఎంటర్ అయ్యారు రెడ్డెప్ప.. అంతకు మునుపు పుంగనూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ పెద్దిరెడ్డి వెనుక తిరిగేవారు .. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అనుహ్యాంగా చిత్తూరు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటికీ పెద్దిరెడ్డి కనుసన్నలలోనే నడుస్తున్నారు.

అదలా ఉంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలో సగం మంది తమిళ వలస ఓటర్లే ఉంటారు. ఒకవైపు నారాయణస్వామి వర్గం చేస్తున్న వ్యతిరేక ప్రచారంతోనే రెడ్డెప్పలో గుబులు రేగుతుందంట. మరోవైపు తమిళ ఓటర్లను ఎలా సంతృప్తి పర్చాలో అర్థం కాక సతమతమవుతున్నారంట. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఎస్సీ వర్గానికి చెందిన తమిళ మాలల ప్రాబల్యం ఎక్కువ. దాంతో తనకు ఎస్ సి ఓట్లు పడతాయా లేదా అన్న సందేహంలో ఉన్నారంట రెడ్డెప్ప. అయితే తన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు వింటే సరిపోతుంది కదా అని .. భారమంతా ఆయనపై వేశారంటున్నారు.

మరోవైపు జీడినెల్లూరు నియోజకవర్గానికి చెందిన అర్టీసి వైఎస్ చైర్మన్ విజయానందరెడ్డి .. ఇక్కడ అభ్యర్థికి అర్థిక సహాకారంతో పాటు.. అన్నివిధాలా అండగా ఉంటారంటున్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి, ఇంకోవైపు విజయానందరెడ్డిల మద్దతుతో రెడ్డెప్పలో ఒకింత ధీమా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సొంత పెత్తనం ఎందుకులే .. పెద్దలు చెప్పినట్లు చేస్తే సరిపోతుంది కదా అని.. సన్నిహితులతో అంటున్నారంట రెడ్డెప్ప. ఆయన లెక్కలు ఆయన వేసుకుంటుంటే .. వచ్చే జాబితాలో అనంతపురం జరిగినట్లు ఇక్కడ కూడా మార్పులు జరిగే అవకాశముండదా? అన్న దింపుడు కళ్లెం అశలతో ఉన్నారంట నారాయణస్వామి అనుచరులు. మొత్తానికి అలా సాగిపోతోంది జీడినెల్లూరు వైసీపీ రాజకీయం.

Tags

Related News

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Big Stories

×