EPAPER

Jammalamadugu: జమ్మలమడుగులో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం..

Jammalamadugu: జమ్మలమడుగులో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం..

Jammalamadugu| ఫ్యాక్షన్ గడ్డలో దశాబ్దంనర కాలం తర్వాత మళ్లీ మాటలు యుద్ధం మొదలైంది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇద్దరు నాయకుల డైలాగ్ వార్ తో.. గతంలో లాగా ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ మొదలు కానున్నాయా అని ప్రజల్లో గుబులు పట్టుకుంది.


కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనగానే గుర్తొచ్చే ప్రాంతాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. గతంలో ఇక్కడ దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య హోరాహోరీగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. మళ్లీ ఇప్పుడు జమ్మలమడుగు రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హేమాహేమీ నేతల మధ్య మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇరువురు నేతలు తగ్గేదేలే అంటూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

ఏపీ రాజకీయాలలో జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడు సంచలనమే. రామసుబ్బారెడ్డి కుటుంబానికి, ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి గత 40 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తోంది. రెండు ఫ్యాక్షన్ కుటుంబాలే. ఎప్పుడు ఎక్కడ ఎలా తలపడతాయో ఎవరికీ తెలియదు. అటువంటి కుటుంబాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఇప్పుడిప్పుడే ఫ్యాక్షన్ రాజకీయాలు కాస్తంత కుదుటపడ్డాయని.. అనుకుంటున్న తరుణంలో మరో మారు హేమాహేమీలు డైలాగ్ వార్ తో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.


Also Read: అమెరికాను తాకిన ఏపీ మద్యం వాసన.. ఎక్సైజ్ శాఖకు ఆదాయమే ఆదాయం..

గత దశాబ్దంనర వీరి ఇరువురు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ స్తబ్దుగా ఉండిపోయింది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రెండు కుటుంబాలను కలిపారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న గుండ్లకుంట రామసుబ్బారెడ్డి కుటుంబం వైసీపీ గూటికి చేరింది. మొదటి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా ఉన్న.. దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబం టీడీపీలోనే ఉండిపోయింది. గత ఎన్నికల సమయంలో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేతలు మళ్లీ కొత్తగా మాటల యుద్ధానికి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పోన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి దాడులకు ప్రతి దాడులు తప్పవని చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసాయి. అందుకు దీటుగా బీజేపీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఒకరు వైడ్ బాల్ అయితే , మరొకరు నోబాల్ అని వైసీపీ నేతలపై ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ప్రజలకు ఆశ చూపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా సిక్స్ కొట్టడానికి ఆదినారాయణ రెడ్డికి బ్యాట్ లేస్తుందా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హామీలు అమలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే తప్ప, సిక్స్ కొట్టలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి.

Related News

AP BJP Leaders Viral Video: ఏపీ బీజేపీలో కలకలం.. నేతల బూతు వీడియోల వెనుక..

Jagan Paper Ballot: దేశ రాజకీయాల్లో జగన్ చిచ్చు.. పేపర్ బ్యాలెట్ ఎన్నికల పాట పాడుతున్న వైసీపీ

Jagan Good Book: నారా లోకేష్ రెడ్ బుక్ Vs జగన్ గుడ్ బుక్.. ఏపీలో హాట్ టాపిక్ గా బుక్ ల వ్యవహారం

YS Jagan vs TDP: తొలిసారి నిజాలు చెప్పిన జగన్, అవే మాటలు.. కార్యకర్తలకు బోరు కొట్టకుండా..

Road Accidents in AP: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!

AP Cyclone warning: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

Big Stories

×