EPAPER
Kirrak Couples Episode 1

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Jaggareddy Reaction Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్… అలాంటి వ్యక్తి ఇంతమంది భక్తులను ఆందోళనకు గురిచేసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావట్లేదు. లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు… ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు. దేశవిదేశాల్లో ఉన్న భక్తులు ఇపుడు లడ్డూ తినాలా వద్దా అనే ఆందోళనలో ఉన్నారు. తిరుపతిలో స్వామి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తింటేనే భక్తులకు తృప్తి.. ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.


తిరుపతి వెంకన్న స్వామి అందరివాడు… వైసీపీ, టీడీపీ రాజకీయ గొడవల్లో శ్రీవారిని ఆలయాన్ని ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేయకండి. మీ రాజకీయాలు, కొట్లాటలు వేరే సబ్జెక్టుల మీద.. వేరే అంశాల మీద పెట్టుకోండి… అంతేకానీ దేవుడి విషియంలో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తక్షణమే విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. హిందువుల మనోభావాలను కాపాడాలని సూచించారు. తక్షణం దీనిపై విచారణ చేసి దోషులని శిక్షంచాలి. ఈ విషయంలో రాజకీయాలు మానేయండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ విశిష్టతను కాపాడటంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏపీలోని రాజకీయ పార్టీలకు ఇది నా విజ్ఞప్తి’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Also Read: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?


Related News

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Big Stories

×