EPAPER

Jagan Latest Tweet: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్

Jagan Latest Tweet: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్

Jagan Comments: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘చంద్రబాబూ.. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.


ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను వైసీపీ హయాంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలోనే చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు అందించి వారికి అండగా నిలిచాం. దీంతో ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

ఎన్నికల కోడ్‌ కారణంగా 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తరువాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సింది. కానీ, ఈ విషయాన్ని అసలే పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ ఏడాది కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొని ఉన్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను.


అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20 వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకులచుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులసహా, ఇన్స్యూరెన్స్‌ ప్రీమియంకట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్స్యూరెన్స్‌ సొమ్మును తక్షణమే విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.

రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు’ అంటూ ఆ పోస్ట్ లో జగన్ పేర్కొన్నారు.

 

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×