EPAPER

Jagan petition: జగన్ పిటీషన్.. మూడు వారాలకు వాయిదా, హోదా మాటేంటి?

Jagan petition: జగన్ పిటీషన్.. మూడు వారాలకు వాయిదా, హోదా మాటేంటి?

Jagan petition: వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష‌హోదా వస్తుందా? రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? దీనివల్ల పార్టీకి ఏమి కలిసిరాదు. తన పంతం నెగ్గించుకోవడానికి మాత్రమేనని అంటున్నారు. న్యాయస్థానం ఒకవేళ ప్రతిపక్ష‌హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి వెళ్తారా? అంటే చెప్పడం కష్టమేనని అంటున్నారు ఆ పార్టీ నేతలు.


తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ న్యాయస్థానం తలుపుతట్టారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. రూల్ పొజిషన్ వివరాలు తన ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేసింది.

మంగళవారం జగన్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. జగన్ తరపు న్యాయ వాది తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం కక్ష పూరితంగానే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని విని పించారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌‌కు లేఖ ఇచ్చారా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. గత నెల 24న స్పీకర్ లేఖ ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను వాయిదా వేసింది.


ALSO READ: షర్మిల ట్రాప్‌లో జగన్, ఎందుకు?

ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ గతనెలలో స్పీకర్‌కు లేఖ రాశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయనను ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా మాత్రమే గుర్తించారు. కానీ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ నోరుఎత్తలేదు. మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×