EPAPER
Kirrak Couples Episode 1

Jagan : షర్మిలకు జగన్ రాయబారం.. కడప ఎంపీ సీటు ఆఫర్..!

Jagan : షర్మిలకు జగన్ రాయబారం.. కడప ఎంపీ సీటు ఆఫర్..!

Jagan : మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలో అడుగుపెడతారనే వార్త వైసీపీలో అలజడి రేపుతోంది. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించి అధికార పార్టీలో గుబులు పుట్టించారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న చాలామంది నేతలు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. టిక్కెట్ దక్కదని తేలితే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఇలాంటి నాయకులందరూ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేయడంతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది. ఆమె కాంగ్రెస్‌లో చేరకుండా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. చెల్లెలికి వైవీ సుబ్బారెడ్డితో రాయబారం పంపారు. ఆదివారం షర్మిలతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరొద్దని సూచించారు. జగనే ఈ విషయం చెప్పారని ఆమెతో అన్నారని తెలుస్తోంది. షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. అయితే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? అని షర్మిల వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు జగన్ ప్రతిపాదనను షర్మిల తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తాజాగా పరిణామాలతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వైసీపీపై బాగా పడుతుందని అంటున్నారు. మరి చెల్లి కాంగ్రెస్ చేరడం ఇంకా ప్రయత్నాలు జగన్ చేస్తారా? ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే జగన్ వ్యూహమేంటి? ఇదే విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.


.

.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×