EPAPER

Anant-Radhika Marriage: జగన్‌ను దూరం పెట్టిన అంబానీ.. అందుకే పెళ్లికి పిలవలేదా..?

Anant-Radhika Marriage: జగన్‌ను దూరం పెట్టిన అంబానీ.. అందుకే పెళ్లికి పిలవలేదా..?

Jagan not Attned the Anant-Radhika Wedding: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎక్కడు న్నారు? ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు ఆయన పరిమితమయ్యారా? బయటకు ఎందుకు రావడం లేదు? ఒక వేళ వెళ్తే.. మహా అయితే పులివెందులకు రెండుసార్లు మాత్రమే వెళ్లారు. కార్యకర్తలకూ ఆయన ముఖం ఎందుకు చాటేస్తున్నారు? ఆసియా టాప్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో ఎందుకు కనిపించలేదు? ఇంతకీ ఆహ్వానం పంపారా? అంబానీ ఆహ్వానించినా వెళ్లలేదా? లేక జగన్‌ని ఆయన దూరంగా పెట్టారా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.


ఆసియా టాప్ బిజినెస్‌మేన్ ముకేష్ అంబానీ కొడుకు అనంత్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి మాగ్జిమమ్ అందరూ హాజరయ్యారు. మ్యారేజ్‌లో సెలబ్రిటీల డ్యాన్సుల జోరు అంతా ఇంతా కాదు. మూడు రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలీదు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముకేష్‌అంబానీ స్వయంగా వారితో మాట్లాడారు.

ఇంతవరకు బాగానే ఉంది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్కడ అన్నది అసలు ప్రశ్న. ముకేష్ అంబానీ ఆయనను ఆహ్వానించారా? లేదా? అన్నది అసలు పాయింట్. అంబానీ ఇంట పెళ్లికి యూపీ నుంచి అఖిలేష్ యాదవ్, బీహార్ నుంచి లాలూప్రసాద్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కానీ మాజీ సీఎం జగన్ కనీసం మచ్చుకైనా కనిపించలేదు.


Also Read: మీరు నన్ను ట్రోల్ చేయలేదా? మంచైనా, చెడైనా చేస్తారు మరీ: అంబటి

జగన్‌ను అంబానీ ఫ్యామిలీ దూరంగా పెట్టిందా? ఎందుకు అన్నదే అసలు ప్రశ్న. మ్యారేజ్‌కు ప్రధాని నరేంద్రమోదీ వస్తారని భావించి జగన్ వెళ్లలేదా? అక్కడికి వెళ్తే ముఖం చిన్న బుచ్చుకుంటుందని భావించి దూరంగా ఉన్నారా? నాలుగేళ్ల క్రితం జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముంబై నుంచి నేరుగా ముకేష్ అంబానీ, ఆయన కొడుకు అనంత్ స్వయంగా విజయవాడ వచ్చారు. అప్పటి సీఎం జగన్‌ను కలిశారు.

ఆ సమయం లో ఏం జరిగిందో తెలీదు. కొద్దిరోజుల తర్వాత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వానీని వైసీపీ రాజ్యసభ పంపింది. కొద్దిరోజుల తర్వాత జియోలో జగన్ పెట్టుబడులు పెట్టడం జరిగి పోయింది. ఆ తర్వాత మళ్లీ ముకేష్ అంబానీ ఏపీకి రాలేదు. అంబానీ సాయం కోరిన తర్వాత జగన్, ఆ కుటుంబంతో రిలేషన్స్ కొనసాగించలేదని వైసీపీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. అంబానీ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నవారికి మాత్రమే ఆహ్వానించారని అంటున్నారు. మరి ముకేష్ అంబానీ పిలిచారో లేదో గానీ, జగన్ అక్కడికి వెళ్లకపోవడం అవమానమేనని అంటున్నారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×