EPAPER

Jagan: జైలులో మాజీ ఎంపీతో జగన్ ములాఖత్.. మేం వస్తే టీడీపీకి ఇదే గతి.. మళ్లీ అబద్దాలే..

Jagan: జైలులో మాజీ ఎంపీతో జగన్ ములాఖత్.. మేం వస్తే టీడీపీకి ఇదే గతి.. మళ్లీ అబద్దాలే..

Jagan: చంద్రబాబు సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పెట్టుకోవడం సులభమైన పని అని, అదేమీ ఘన కార్యంకాదన్నారు. రెడ్ బుక్ మీకే సొంతం అని అనుకోవద్దని, ఇలాంటి తప్పుడు సంప్రదాయం సునామీలా వస్తుందన్నారు. టీడీపీ భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారాయన.


వైసీపీ ప్రభుత్వం వస్తే.. టీడీపీ నాయకులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు మాజీ సీఎం జగన్. ఇలాంటి దుర్మార్గమైన పాలనను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సాక్షులను బెదిరించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అరెస్ట్ అయినవారంతా ఆరోజు ఘటన జరిగిన ప్రదేశంలో లేరన్నారు.

ALSO READ: ఉభయ గోదావరి జిల్లాలను భయపెడుతున్న.. ఉగ్ర గోదావరి


నాలుగేళ్ల కిందట జరిగిన ఘటనపై ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.. ముఖ్యమంత్రిపై చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో అభిమానులు టీడీపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారంటూ మళ్లీ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్.

పనిలో పనిగా ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపైనా స్పందించారు జగన్. బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్లకు పర్మిషన్ ఇచ్చిందెవరన్నారు. టీడీపీ గెలిచిన తర్వాత విజయోత్సవంలో ఆ బోట్లు పాల్గొన లేదా అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులతో చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు దిగలేదా అని అన్నారు.

కొట్టుకు వచ్చిన బోట్లను రాజకీయ చేస్తున్నారని దుయ్యబట్టారు పులివెందుల ఎమ్మెల్యే. కృష్ణాకు వరదలు వస్తున్నాయని తెలిసినా, భారీ వర్షాలు పడతాయని సమాచారం ఉన్నా సీఎం చంద్రబాబు రివ్యూ చేయలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు. ఆయనపై కేసు పెట్టాలన్నారు.

సీఎం చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, తన ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తారంటూ మళ్లీ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని విమర్శించారు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో బుధవారం మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌తో జైల్లో ములాకత్ అయ్యారాయన. అనంతరం మీడియాతో మాట్లాడారాయన. జగన్ రాకను తెలుసుకున్న వైసీపీ అభిమానులు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్‌తో పాటు జైల్లోకి వెళ్లేందుకు యత్నించారు కార్యకర్తలు.

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×