EPAPER

YS Jagan Mohan Reddy: అర‌రే.. ఒక్క పోస్ట్ తో జగన్ ఇలా బుక్కయ్యాడేంటి?

YS Jagan Mohan Reddy: అర‌రే.. ఒక్క పోస్ట్ తో జగన్ ఇలా బుక్కయ్యాడేంటి?

Jagan criticized Chandrababu, post viral in Social Media : బుడమేరు ధాటికి బెజవాడ నీటి మునిగింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా వర్షాల్లోనే తడుస్తూ , వరద నీటిలోనే తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బెజవాడలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి.. బెంగళూరులో సెటిల్ అయిపోయారు. పాస్‌పోర్టు లేక లండన్ ఫ్లైట్ ఎక్కలేకపోయిన ఆయన.. చంద్రబాబు పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో అటు టీడీపీకి నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు.


సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి . కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల మూడున లండన్‌ వెళ్లేందుకు అన్నీ సిద్దం చేసుకున్న ఆయనకు పాస్‌పోర్టు కష్టాలు మొదలయ్యాయి. ఈ లోపు బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. బాధితులను పరామర్శించకుండా విమానమెక్కితే విమర్శలు వస్తాయని. రెండ్రోజులు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. వచ్చిన రెండు సార్లు పదంటే పది నిముషాలు గడిపి వెళ్లిపోయారు

కృష్ణా నది వరదల్లో ఉండవల్లిలోని తన నివాసం మునిగిపోకుండా ఉండేందుకు బెజవాడను ముంచారని.. బాధితులకు సాయం అందుతున్నా.. అందడం లేదని ఆరోపించి విమర్శల పాలయ్యారు. లండన్‌ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న ఆయనకు పాస్‌పోర్టు సమస్య ఎదురవ్వడంతో ఆ టెన్షన్‌లో పడినట్లు కనిపిస్తున్నారు. సీఎం పదవి పోయిన వెంటనే.. ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లమేటిక్‌ పాస్‌పోర్టు రద్దయిపోయింది.


అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్‌పోర్టు స్వాధీనానికి ఆదేశించింది. కుమార్తె పుట్టినరోజుకు లండన్‌ వెళ్లడానికి ఇటీవల ఆయనకు అనుమతిచ్చిన సీబీఐ కోర్టు.. సాధారణ పాస్‌పోర్టును ఐదేళ్ల పాటు రెన్యువల్‌ చేయాలని ఆదేశించింది. ఆ కోర్టు జగన్‌కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)

వాస్తవానికి జగన్‌ తన లండన్‌ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదంట. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిన తర్వాతే జగన్ లండన్ టూర్ విషయం తెలిసిదంట. తాజాగా ఆయన అయిదేళ్ల పరిమితితో పాస్‌పోర్ట్ కోసం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ వేయడంతో పాస్‌పోర్టు సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3 నుంచి 25 వరకు జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. విజయవాజ ప్రజాప్పతినిధుల కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపై ఎన్‌వోసీ తీసుకోవాలని పాస్ పోర్టు ఆఫీస్ జగన్ కు లేఖ రాసింది.  ఎన్‌వోసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌ మోహన్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షరతులపై జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ పాస్ పోర్టు కష్టాల నడుమే జగన్ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎంను ఉద్దేశించి వైసీపీ అఫిషియల్ సైట్లో జగన్ పెద్ద పోస్టు పెట్టారు. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మొదలుపెట్టి అసలు సహాయక చర్యలే జరగడం లేదని.. ఉదారంగా బాధితులను ఆదుకోకపోతే వైసీపీ తరపున పోరాటాలు చేస్తామని సుదీర్ఘంగా విమర్శించారు.

జగన్ విమర్శలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాస్‌పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ పారిపోవాల్సిన జగన్ బెంగళూరు ప్యాలెక్స్‌లో రిలాక్స్ అవుతూ బురద రాజకీయానికి బ్రాండ్ అండాసిడర్‌గా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మొత్తానికి జగన్‌ సుదీర్ఘ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. సోషల్‌మీడియాలో విమర్శలు ఆపేసి.. చేతనైతే ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండని సూచిస్తున్నారు.

 

Related News

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Big Stories

×