EPAPER

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. మరి సీబీఐ దర్యాప్తును పూర్తి చేసిందా లేదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై వివేకా కుమార్తె సునీత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అదేరోజు సుప్రీంకోర్టుకు వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించనుంది. దర్యాప్తు ముగిసిందా..? విచారణ గడువు పెంచమని సీబీఐ కోరుతుందా ? ఈ విషయాలపై సందేహాలు ఉన్నాయి.

మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు.


ఇరుపక్షాల వాదనల విన్న నాంపల్లి కోర్టు నిందితుల రిమాండ్‌ను జూలై 14 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసింది. గతంలోనే దర్యాప్తు సంస్థ రెండు ఛార్జ్‌షీట్‌లు కోర్టుకు సమర్పించింది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×