EPAPER

Pawan Kalyan: కాకినాడలో కాక.. పవన్ వర్సెస్ ద్వారంపూడి.. హైటెన్షన్

Pawan Kalyan: కాకినాడలో కాక.. పవన్ వర్సెస్ ద్వారంపూడి.. హైటెన్షన్
pawan kalyan kakinada

Pawan Kalyan: కాకినాడలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. సాయంత్రం సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి సంగతి చెబుతానన్న పవన్ కామెంట్‌తో ఉత్కంఠ పెరిగింది. ఇటు ద్వారంపూడి కూడా ఐయామ్ వెయిటింగ్ అంటున్నారు. ప్రతిమాటకు కౌంటరిస్తా అంటున్నారు. లేనిపోని పోని విమర్శలు చేస్తే.. వదలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు ద్వారంపూడి.


తాను కాకినాడ వస్తున్నా.. కాస్కో అంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి ఇప్పటికే పవన్‌ సవాల్ చేశారు. మరి, సాయంత్రం ఏం జరగబోతుంది? పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడబోతున్నారు? ఇలా జనసేనాని కాకినాడ సభపై హైటెన్షన్.

గతంలో పవన్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం.. పెద్ద రచ్చకు దారితీసింది. జనసేన నాయకులు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మధ్య రాళ్ల దాడి జరిగింది. ఇప్పుడు పవన్‌ కూడా ద్వారంపూడిని టార్గెట్‌ చేస్తూ కామెంట్ చేయడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఎప్పుడో జరిగిన విషయాన్ని పవన్‌ మళ్లీ తెరపైకి తెస్తున్నారా? అసలు ద్వారంపూడిని పవన్‌ ఇంతగా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి? అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు ద్వారంపూడి కూడా పవన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిదానికి కౌంటర్‌ ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పది గంటలకు ప్రెస్‌మీట్‌ పెడతానన్నారు. కాకినాడలో పుట్టా.. కాకినాడలోనే పెరిగా.. ఏ విషయంలోనూ తగ్గేదే లేదు మరింత కాక రేపారు ఎమ్మెల్యే ద్వారంపూడి.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×