EPAPER

Pawan Kalyan: పవన్ వైసీపీ ట్రాప్ లో పడ్డారా? జగన్ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతోందా?

Pawan Kalyan: పవన్ వైసీపీ ట్రాప్ లో పడ్డారా? జగన్ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతోందా?

Pawan Kalyan: పవన్ అంటే ఫైర్. పవన్ అంటే పవర్. పవన్ అంటే ఎమోషన్. పవన్ అంటే అగ్రెసివ్. మాటంటే పడరు. మాట అన్నవారిని వదలరు. మాటకు మాట గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే. అందుకే, తరుచూ ఆవేశానికి లోనవుతుంటారు. మాటల దాడి చేస్తుంటారు. పవన్ లోని ఈ వీక్ నెస్ ను వైసీపీ బాగా క్యాచ్ చేసినట్టుంది. అందుకే, చాలాకాలంగా జగన్ అంట్ కో మైండ్ గేమ్ లో చిక్కుకుని పవన్ ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారని అంటున్నారు. రణస్థలంలో జరిగిన యువశక్తి సభలోనూ పవన్ పై వైసీపీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు.


యువశక్తి వేదికగా యువతకు జనసేనాని ఇచ్చిన మెసేజ్ ఏంటి? అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. పవన్ స్పీచ్ ను గుర్తు చేసుకుంటే.. అందులో అంతా విమర్శలు, తిట్లే ఉంటాయి. రణస్థలం నుంచి దాదాపు గంట సేపు మాట్లాడారు జనసేనాని. అందులో సగం ప్రసంగం వైసీపీ నేతలను తిట్టేందుకే సరిపోయింది. జగన్ ను, అంబటిని, రోజాను, అమర్నాథ్ రెడ్డిని.. ఇలా ఒక్కోనేతను తనదైన స్టైల్ లో విమర్శిస్తూ.. మధ్య మధ్యలో సైకోలు, సన్నాసులు, వెధవలు, సంబరాల రాంబాబు, ఆటిన్ రాజా, డైమండ్ రాణి లాంటి పదాలు తగిలిస్తూ.. ప్రసంగాన్ని స్పైసీగా మార్చేశారు. ఇక తాను ప్యాకేజీ స్టార్ కాదని.. చంద్రబాబు నుంచి ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదని బలంగా చెప్పేందుకు చాలా సమయమే కేటాయించారు. మూడు పెళ్లిళ్లపైనా కౌంటర్ ఇవ్వక తప్పలేదు. ఇక్కడే వైసీపీ గేమ్ ప్లాన్ వర్కవుట్ అయిందని అంటున్నారు.

పవన్ అంటే మిస్టర్ క్లీన్. మిస్టర్ పర్ ఫెక్ట్. జనసేనానిలోని ఆవేశమే ఆయనకు ప్లస్. అలానే మైనస్ కూడా. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పవన్ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండేవి. ప్రత్యేక హోదాపై కేంద్ర బీజేపీని నిలదీసే సమయంలో పవన్ ప్రసంగం కోసం అంతా ఎదురు చూసేవాళ్లు. పుస్తకాలు, చరిత్ర విషయాలను కోట్ చేస్తూ.. మంచి మంచి ఉదాహరణలు ఇస్తూ.. ‘పాచిపోయిన లడ్డూ కావాలా నాయనా?’ లాంటి పవర్ ఫుల్ డైలాగులు వదులుతూ.. అద్భుతంగా ప్రసంగించేవారు. ఆనాటి ఆయన సభలు ఫాలో అయి.. అనేకమంది తటస్థులు జనసేన అభిమానులుగా మారారంటారు.


ఈ విషయం బాగా గుర్తించిన జగన్.. అప్పటి నుంచే టాపిక్ డైవర్షన్ లో భాగంగా పవన్ పై లేనిపోని అబాంఢాలు, ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. గిల్లితే గిల్లిచ్చుకునే టైప్ కాదని తెలిసే.. పవన్ ను రెచ్చగొట్టి.. ఆయన నోటి నుంచి తిట్లు రప్పించాలనే టార్గెట్ తోనే.. వైసీపీ నేతలు పదే పదే పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. తనను విమర్శించి వారందరినీ పేరు పేరున తిరిగి విమర్శించడం పవన్ నైజం. అందుకే, నిత్యం ఓ అరడజను మంది మంత్రులు పవన్ పై ఫైర్ అవుతుంటారు. ఇలాంటి సభలు, సమావేశాలు జరిగినప్పుడల్లా.. వారికి కౌంటర్లు ఇవ్వడంతోనే సరిపోతోంది పవన్ కు. అసలు మేటర్.. ఈ స్పైసీ మేటర్ వెనుక మరుగున పడిపోతుంటుంది. జగన్ కు కావలసిందిదే. పవన్ మార్చుకోవాల్సిందీ ఇదే.

తాను నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తానని పవన్ తరుచూ చెబుతుంటారు. నిజమే. పవన్ నిజాయితీ మీద ఎవరికీ అనుమానం ఉండకపోవచ్చు. హీరోగా కోట్లు సంపాదించే పవన్.. రాజకీయాల కోసం అదంతా ఖర్చు చేస్తుంటారని కూడా తెలుసు. కానీ, కావాలనే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుంటారంటూ.. ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటారు. ఇటీవల చంద్రబాబును పవన్ కలిసింది కూడా ప్యాకేజీ కోసమేనంటూ లేనిపోని కహానీలు అల్లి ప్రజల్లో చర్చకు పెట్టారు. ఒకటికి పదిసార్లు ఒకే మాట చెబితే.. అది నిజమే కావచ్చు అని జనాలు అనుకోవాలనేది వైసీపీ గేమ్ ప్లాన్ అంటున్నారు. ఆ విషయం పసిగట్టిన పవన్.. తాను ప్యాకేజీ స్టార్ కాదని క్లారిటీ ఇచ్చుకునేందుకు ప్రతీ మీటింగ్ లోనూ కొంత సమయం వెచ్చించాల్సి వస్తోంది.

కావాలనే రణస్థలం సభకు ముందు వైసీపీ మంత్రులు వరుసబెట్టి పవన్ ను విమర్శించారు. వాళ్లు అనుకున్నట్టుగానే.. జనసేనాని సైతం వరుసబెట్టి వారందరికీ కౌంటర్లు ఇచ్చారు. సభ థీమ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సభ మర్నాడు మళ్లీ వైసీపీ మంత్రులు వరుసగా పవన్ వ్యాఖ్యలపై మళ్లీ విమర్శలు చేయడం.. మీడియా మొత్తం ఆ తిట్లపురాణం చుట్టూనే న్యూస్ నడపడంతో.. యువశక్తి ఉద్దేశం వక్రభాష్యంగా మారింది.

ఇక పవన్ ప్రతీసారీ సన్నాసులు, వెధవలు, సైకోలు అంటూ వైసీపీ వాళ్లను తిట్టడం కూడా ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కు రుచించడం లేదంటున్నారు. తనను తిడితే, తానూ తిడతా.. అనేది పవన్ పాలసీ. దీన్ని ఆసరా చేసుకునే.. కావాలనే పవన్ ను కవ్వించడం.. ఆయన నోటి నుంచి వైసీపీ భాష మాట్లాడించడం.. అది చూసి ఓ వర్గం విరక్తి చెందడం.. పవన్ సైతం మిగతా నాయకుల మాదిరే దిగజారిపోతున్నారనేలా ప్రచారం చేయడం.. ఇదంతా వైసీపీ పక్కా ప్లాన్డ్ గా నడిపిస్తున్న రాజకీయం అంటున్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని తెలిసి కూడా.. తాను సైతం అదే స్థాయిలో రివర్స్ అవకపోతే.. ప్రజలు తనను బలహీనుడిగా భావించే అవకాశం ఉందని.. వైసీపీ చేస్తున్న అసంబద్ధ ఆరోపణలు నిజం అనుకునే ప్రమాదం ఉందని భావించే జనసేనాని సైతం వైసీపీ స్థాయిలోనే రాజకీయ మాటల యుద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ పవన్ కు లాభమా? నష్టమా?

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×