EPAPER

Galla Jayadev: తరతరాల రాజకీయ జీవితానికి శుభం.. టీడీపీకి గల్లా గుడ్ బై ..?

Galla Jayadev: తరతరాల రాజకీయ జీవితానికి శుభం.. టీడీపీకి గల్లా గుడ్ బై ..?

Galla Jayadev: టీడీపీలో బలమైన నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? ఢిల్లీ నుండి గల్లీ దాకా పార్టీ అధినేత వెంట నడిచిన నాయకుడు ఇప్పుడు కనుమరుగయ్యారా..? తరాలుగా రాజకీయంలో మునిగి తేలిన కుటుంబం ఇకపై పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలనుకుంటుందా..? సూచనలన్నీ అలాగే ఉన్నాయి. గల్లా కుటుంబం రాజకీయాలకు బై బై చెప్పాలనుకుంటుందట. ఎందుకలా..?


ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గల్లా నిర్ణయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మూడు తరాల రాజకీయ జీవితానికి గల్లా కుటుంబం పుల్ స్టాప్ పెట్టబోతుందనే వార్త చాలా మందిని షాక్‌కి గురిచేస్తోంది. దీనితో ఏపీలో ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం ఇకపై రాజకీయాలను నుండి చిత్తగించి, వ్యాపారానికే పరిమితం కాబోతుంది. అవును.. తాత, తల్లి వారసత్వంగా వచ్చిన రాజకీయ జీవితాన్ని ఇకపై ముగించాలనుకుంటున్నారు అమరరాజ సంస్థల చైర్మన్ గుంటూరు ఎంపి గల్లా జయదేవ్. తాత స్పూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన గత ఐదు సంవత్సరాల అనుభవాల నేపథ్యంలో రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామంతో టీడీపీకి ఎంతో కొంత నష్టం కలగకపోదు అనేది ఆ పార్టీలో చర్చిస్తున్నారు. కొంత కాలంగా ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఊతమిచ్చిన ఇటీవల యువగళం యాత్రలో కూడా గల్లా ఎక్కడా కనిపించలేదు. చివరికి, తాజాగా సక్సెస్ అయిన యువగళం నవశకం సభలో సైతం పాల్గొనలేదు.

గల్లా తాత, పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపి రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరు పొందిన నేత. ఎన్‌జి రంగా అనుచరుడిగా అయనకు ఎంతో పేరు ఉంది. రంగా కోసం తన ఎంపీ సీటును సైతం త్యాగం చేసిన వ్యక్తిగా ఆయన్ను ప్రజలు ఎంతో ఆదరించారు. ముఖ్యంగా, రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా రాజగోపాల్ ప్రజా మన్ననలు పొందారు. మరో వైపు సామాజిక సేవలో భాగంగా రాయలసీమలోనే అతి పెద్దదైన ఎన్జీఓ ‘రాస్’ను కూడా ఆయన స్థాపించారు. 1955లో చిత్తూరు శాసనసభ్యుడిగా, 1973లో చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎంపికైన వ్యక్తిగా రాజగోపాల్ రాజకీయ చిత్రం ఉన్నతమైంది. 1977, తర్వాత 1980లలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా రెండు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. మూడవ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌జి రంగాను గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకొచ్చి, స్వాంతంత్ర పార్టీ తరఫున లోక్‌సభ సభ్యుడిగా గెలిపించాడు. రాజకీయ నేతగానే కాక, రచయితగా పలు పుస్తకాలు రచించింన ఆయన ప్రభావం సమాజంపై బహుముఖంగా ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి, టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడికి మొదట్లో చాలా సాయం చేసినట్లు తెలుస్తోంది.


ఇక, రాజగోపాల్ నాయుడి వారసురాలిగా తర్వాత ఆయన ఏకైక కూమార్తే గల్లా అరుణ కుమారి 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి నుంచి విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కూమార్ రెడ్డిల పాలనా కాలంలో పది సంవత్సరాల పాటు మంత్రిగా కూడా పనిచేసారు. రాష్ట విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టిడిపి తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టిడిపి రాష్ట ఉపాద్యక్షురాలిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికి పోటీకి దూరంగా ఉండి పోయారు. అయితే, ఆ కుటుంబానికి చెందిన అమె కూమారుడు గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా రెండు సార్లు టిడిపి నుంచి వరుస విజయాలు సాధించారు.

గల్లా అరుణ కూమారి భర్త గల్లా రామచంద్రనాయుడు గల్లా పరిశ్రమల చైర్మన్ గా పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకోని గల్లా జయదేవ్ ను చైర్మన్ గా చేసారు.పూర్తి స్థాయివ్యాపార కార్యకలపాలకు సమయం కేటాయించడానికి తాము రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని అంటున్నారు గల్లా ప్యామీలి.అయితే మరో కారణం కూడా కనిపిస్తుంది. గత ఐదు సంవత్సరాలలో అమరరాజ సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది ఎపి ప్రభుత్వం.ముఖ్యంగా పరిశ్రమల వల్ల పోల్యూషన్ వస్తుందనే కారణంతో అనేక సార్లు తనిఖీలు నిర్వహించారు.చివరకు సీజ్ చేయాలని కూడా అదేశాలు జారీ చేసారు.24గంటల పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసారు.గతంలో చిత్తూరు వద్ద ఇచ్చిన భూమిని తిరిగి వెనుకకు తీసుకోవాడానికి ప్రయత్నించింది.దీంతో కోర్టు ద్వారా వారు తిరిగి వెనుకకు తెచ్చుకున్నారు.దీంతో తమ వ్యాపార కార్యకలపాలను ఏపికి దూరంగా చేయడానికి నిర్ణయించుకున్న అమర రాజ యాజ్యమాన్యం ఇక్కడ విస్తరణకు అవకాశమున్నప్పటికి తమిళనాడు,తెలంగాణలో కొత్త యూనిట్ల ఏర్పాటుకు అయా ప్రభుత్వాలతో ఓప్పందము కుదుర్చుకుంది.గుంటూరులో కూడా ఎంపి జయదేవ్ ఉహించని విదంగా వైకాపా కార్యకర్తలు,పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు.

అయితే, టిడీపీకి ఎంతో బలంగా ఉన్న గల్లా ఫ్యామిలి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్ష టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమ్యయ్యింది. టిడిపిలోని అంతర్గత రాజకీయాలు కూడా గల్లా ప్యామీలీని రాజకీయాలకు దూరం చేసాయనే టాక్ బలంగా వినిపిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఎంతమంది ప్రముఖులు ఉన్నా కాంగ్రెస్‌లో గల్లా అరుణ కూమారి తనదైన శైలిలో హాడావుడి చేసేవారు. అయితే, టిడిపి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ ఆమెను ఇబ్బంది పెట్టాయనే అభిప్రాయం కూడా ఉంది. ఇక ఆమె పోలిట్‌బ్యూరో మెంబర్‌గా ఉన్నప్పుడు చంద్రగిరి ఇన్‌చార్జీగా కూడా ఉన్నారు. అయితే, 2019కి ముందు ఆమెను ఏ మాత్రం సంప్రదించకుండా ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించి పులివర్తి నానీని నియమించారనే ప్రచారం ఉంది. దీంతో పాటు ఆమె స్వంత నియోజకవర్గం అయిన పూతలపట్టులో కూడా ఆమెకు తెలియకుండా అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా కొంత కారణం అని తెలుస్తుంది. మొత్తం మీదా తన మాటలకు విలువలేని పార్టీలో ఉండటం కంటే సైలెంట్‌గా ఉండటం మేలని ఆమె భావించినట్లు సమాచారం.

ఇక, చంద్రబాబు జైలు నుండి విడుదల అయిన తర్వాత హైదరబాదులో కలసిన గల్లా అరుణకూమారి ఈ విషయాలను కుండ బద్దలు కోట్టినట్లు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా 2014లో తన ఓటమికి కారణమయిన అంశాలను ఆమె ఉదాహారణలతో వివరించారని తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టిడిపిలోని ఓవర్గం వ్యతిరేకంగా పనిచేసిందనీ.. వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గురించి కూడా ఆమె అధినేతతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు, రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తమ కుటుంబం పోటీ చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరో వైపు రాజకీయాల వల్ల పరిశ్రమల విస్తరణకు ఇబ్బందిగా ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని అనుకుంటున్నారు. మొత్తం మీదా భవిష్యత్ వ్యాపార ప్రయోజనాలతో పాటు బయటకు కనిపించని అవమానం టిడిపిలో ఎదురుకావడంతో ఆ పార్టీ నుంచి కాక, మొత్తం రాజకీయాల నుంచి గల్లా ప్యామీలీ శాశ్వతంగా దూరం కాబోతుందని ప్రచారం జరుగుతుంది. చంద్రగిరి, పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, నగరి నియోజకవర్గాల్లో గల్లాకు బలమైన అనుచరుగణంతో పాటు, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు భారీగా ఉన్నారు. ఒక వేళ గల్లా ఫ్యామిలీ రాజకీయాలను నుండి ఎంత కాలం దూరంగా ఉండబోతున్నారన్న విషయం భవిష్యత్ తెలుపుతుంది. మొత్తం మీదా చిత్తూరు జిల్లాలో ఓ బలమైన కుటుంబం రాజకీయాలకు దూరం కాబోతుందనే వార్త టీడీపీలో కాస్త కలవరానికి కారణమయ్యింది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×