EPAPER

Chevireddy: విధేయతకు వీరతాడు.. చెవిరెడ్డి ఇష్యూతో వైసీపీలో అంతర్యుద్ధం

Chevireddy: విధేయతకు వీరతాడు.. చెవిరెడ్డి ఇష్యూతో వైసీపీలో అంతర్యుద్ధం

Chevireddy Bhaskar Reddy: ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించారు. ఆయ‌న‌కు ఏకంగా 25 పార్టీ అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అదే ఇప్పుడు వైసీపీలో అసంతృప్తికి కారణమైంది. సొంత సెగ్మెంట్లో కొడుకుని గెలిపించుకోలేక పోయిన చెవిరెడ్డి పార్టీ పటిష్టానికి ఏం పనికి వస్తారని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.


వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్మిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు పార్టీ అధ్యక్షుడు జగన్. పార్టీకి అనుబంధంగా ఉన్న పాతిక విభాగా పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరపరాజయం పాలైంది వైసీపీ. దీంతో ఆ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ఓటమికి కారణమైన వారిలో చెవిరెడ్డి ఒకరు అని అలాంటి వ్యక్తికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ సీనియర్లకు మింగుడుపడటం లేదంట. ఎన్నికల సమయంలో సొంత సర్వేలు చేయించి అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్‌ని చెవిరెడ్డి భ్రమల్లో ఉంచారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిపై జగన్ ఇంకా అంతలా నమ్మకం ఉంచడాన్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీనియర్ నాయకులను కాదని చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా అవకాశాలు ఇచ్చారు. ఆ పదవులను అడ్డం పెట్టుకుని మంత్రికంటే ఎక్కువగా చెవిరెడ్డి చెలాయించారు.


Also Read: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దు.. జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

అంతేకాకుండా ప్రభుత్వంలోని పలుశాఖల నుంచి జీతాలు ఇప్పించి ఓ సర్వే టీమ్‌ను కూడా అప్పట్లో చెవిరెడ్డి నడిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా సర్వేలు చేయిస్తున్నాని హడావిడి చేశారు. ముఖ్యంగా తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌లలో కార్యాలయాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున టీమ్స్ రిక్రూట్ చేసుకుంటూ హడావిడి జరిగింది. ఇక తిరుపతి జిల్లాలో తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వం పొంది.. భూమనతో కలిసి పెత్తనం చేశారు. తన తర్వాత తుడా బాధ్యతలు కూమారుడికి అప్పగించారు. ఆ సమయంలో సైలంట్ గా తుడా నిధులను దారి మల్లించి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసారని, ముఖ్యంగా తుమ్మల గుంట చెరువు పేరుతో నిధుల దుర్వినియోగం చేసారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

సర్వేల పేరుతో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించిన వారిలో చెవిరెడ్డి కూడా ఒకరని క్యాడర్ గట్టిగా నమ్ముతుంది. అయన సర్వేలు పార్టీని కొంప ముంచాయిని అంటున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి సర్వేలు తెలంగాణలో పెయిల్ అయినా.. జగన్ ఆయన్నే నమ్మడంతో.. ఏపీలో కూడా సర్వేల హడావిడితో చెవిరెడ్డి స్వయంగా జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచి.. పార్టీ కొంప ముంచారన్న విమర్శలు ఉన్నాయి. చెవిరెడ్డి తన నియోజకవర్గంలో 2014 నుంచే తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ప్రతిసారి ఎన్నికల్లో వాడుకుంటూ వచ్చారు. అప్పట్లో ప్రతి వెయ్యి ఓట్లకు ఓ అనధికారిక వాలంటీర్‌ను సొంత డబ్బుతో నియమించుకుని హడావిడి చేసారు.

2019 ఎన్నికల్లో అది సక్సెస్ కావడంతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని.. అదే ఆయన 30 ఏళ్ల సీఎం కలను నెరవేరకుండా చేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చంద్రగిరిలో తనకు సొంత సైన్యం ఎలా ఉపయోగపడిందో చెప్పడం వల్లే జగన్ గుడ్డిగా ఫాలో అయ్యారంటారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వీర విదేయుడిని అని చెప్పుకునే చెవిరెడ్డి ఎన్నికల పలితాల తర్వాత హైదరబాద్, తిరుపతి, అమరావతి లోని తన సర్వే కార్యాలయాలు క్లోజ్ చేసి తర్వాత బెంగుళూరు షిప్ట్ అయ్యారు. అయితే తర్వత తన కుమారుడు మోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదవ్వడంతో తిరిగి చంద్రగిరి కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించారని అంటున్నారు.

Also Read: ఆ భయంతోనే భూమన సైలెంట్ గా ఉన్నారా ?

రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి తర్వాత సీనియర్ నాయకులు అయిన అనంతపురం మాజీ ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, కర్నూలుకు చెందిన కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు ఉండగా కేవలం శ్రీకాంత్ రెడ్డితో పాటు చెవిరెడ్డిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. సీనియర్లను గౌరవించకుండా, సామాజిక సమతుల్యత పాటించకుండా.. మరోసారి తమ సొంత సామాజిక వర్గానికి చెందిన భజనపరులకు జగన్ అవకాశం ఇవ్వడం విమర్శల పావుతుంది.

ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ ఓటమికి ఆ ఘటన కూడా ఒక కారణమైంది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అదే పులివర్తి నాని చేతిలో 44 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు. మరోవైపు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారు. అలాంటాయన విధేయతకు జగన్ వీరతాడు వేయడంపై వైసీపీ నాయకులు భగ్గుమంటున్నారు.

చెవిరెడ్డి సర్వేలు నమ్మి జగన్ చాలా చోట్ల అభ్యర్ధులను మార్చేశారు. అలా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నాయకులు అయితే ఇప్పటికీ చెవిరెడ్డికి పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యతతో సొంత దారి చూసుకునే పనిలో పడ్డారంట. మొత్తంమీద చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జగన్ అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. ఒకానొక ద‌శ‌లో మంత్రి ప‌ద‌విని కూడా ఆశించ‌కుండా ఆయ‌న ప‌నిచేశారు. అంతేకాదు.. ఎంతో మంది పోటీలో ఉన్నార‌ని.. త‌న‌కు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌ని చెప్తూ చెవిరెడ్డి తన విన‌యంతో జ‌గ‌న్‌కు మరింత చేరువ‌య్యారంట.

జగన్ ఇంట్లో మ‌నిషిగా క‌లిసిపోవ‌డం.. జ‌గ‌న్ ఆలోచ‌న‌ల మేర‌కు ప‌నిచేయ‌డం చెవిరెడ్డి స్పెషాలిటీ.. జగన్ ఏ పని అప్పగించినా సరే విజయవంతంగా పూర్తి చేయడం చెవిరెడ్డికి తెలిసిన ప్ర‌ధాన విద్య‌.. త‌న‌కు న‌చ్చినట్టు కాకుండా.. జగన్ మెచ్చేటట్లు పనిచేస్తారన్న పేరు ఆయనకు ఉంది. అదీకాక మాస్ లీడర్లా కనిపించే చెవిరెడ్డి.. అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడతారని.. లా చదివి హైకోర్టులో కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. అందుకే ఆయన జగన్‌కు తెగ నచ్చేశారంట.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×