EPAPER

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచన!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచన!

Rain alert in Telangana and AP(Today weather report telugu): తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.నేటి నుంచి ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉండటంతో చెట్ల కింద ప్రజలు ఎవరూ కూడా ఉండకూడదని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పారు.బలమైన నైరుతి రుతపవనాలకు తోడుగా,సముద్రమట్టానికి 3.1 నుండి 7.6 కి.మీ.మధ్యలో ఆవర్తన కొనసాగుతుందని వెల్లడించారు.ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం నేడు బలహీనపడుతుందన్నారు.దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Also Read: పీఎం కిసాన్ కొందరికేనా?


జయశంకర్‌-భూపాలపల్లి, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.గంటకు 30-40 కి.మీ వేగంతో బాలులు వీస్తాయన్నారు.పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.

నేడు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం పొడి వాతావరణం ఉంటుందని సాయంత్రానికి వర్షం పడే అవకాశం ఉందన్నారు.నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది.

ఇక మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో అత్యధికంగా వరపాతం నమోదు అయింది.భద్రాద్రికొత్తగూడెం,జయశంకర్‌ జిల్లాల్లో వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి. నేడు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందన్నారు.పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.గంటకు 30 నుంచి 40 కీ.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×