EPAPER

CM Chandrababu Hyderabad Tour : హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ.. పాపం ఈ ఐపీఎస్‌ కష్టాలు

CM Chandrababu Hyderabad Tour : హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ.. పాపం ఈ ఐపీఎస్‌ కష్టాలు

CM Chandrababu latest news(Andhra pradesh political news): వైసీపీతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఏంటి? సీఎం  చంద్రబాబు వాళ్లకు మళ్లీ ఛాన్స్ ఇస్తారా? లేకుంటే పక్కనబెడతారా? మళ్లీ పాత సీఎం చంద్రబాబును చూస్తారని పదేపదే ఆయన ఎందుకంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. సీఎం చంద్రబాబును దర్శనం చేసేందుకు ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా భద్రతా అధికారులు వాళ్లను గేటు నుంచే పంపించేస్తున్నారు.


తాజాగా ఏపీ నిఘా విభాగం మాజీ చీఫ్ సీతారామాంజనేయులు ప్రస్తుతం హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారయన. జూబ్లిహిల్స్‌ లోని సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తన బాధను చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోయింది.

మూడురోజులుగా సీఎం చంద్రబాబును హైదరాబాద్‌‌లో కలవాలని తెగ ప్రయత్నాలు చేశారు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు. శనివారం, ఆదివారం నాడు సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసు చుట్టూ ఆయన తిరిగారు. భద్రతా సిబ్బంది ఆయన్ని గేటు వద్ద ఆపేసి వెనక్కి పంపించారు. ముందస్తు అపాయింట్మెంట్‌, అనుమతి లేకపోవడంతో సీఎం ఎవరినీ కలవడం లేదని చెప్పి పంపిస్తున్నారు.


ఒకవేళ ఐపీఎస్ సీతారామాంజనేయులకు సీఎం చంద్రబాబు మాట్లాడే ఛాన్స్ ఇస్తే.. తర్వాత వెళ్లాలని భావించారు కొందరు ఐపీఎస్, ఐఏఎస్‌లు. చివరకు ఆయనకు ఛాన్స్ లేకపోవడంతో వారంతా డ్రాపైనట్టు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం అండ చూసుకుని మరీ రెచ్చిపోయారు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబును వారందినీ పక్కనపెట్టారు.

ALSO READ:  ఏపీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వైఎస్ఆర్ బర్త్‌డే వేడుకలకు.. పార్టీని బలోపేతం గురించి…

జూన్ ఆరున ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి సీతారామాంజనేయులు వెళ్తుండగా అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకుని గేటు వద్ద నుంచే వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత జూన్ 13న తొలిసారి సీఎం సచివాలయానికి వచ్చినప్పుడు ఆయనను కలవాలని ప్రయత్నించగా అనుమతి లేదని అధికారులు పంపించేశారు. ఈ పరిస్థితి ముందే గమనించిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. మరో రెండేళ్లు పదవీకాలం ఉండగానే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు వీఆర్‌ఎస్‌కు సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.

Tags

Related News

Punganur Girl Incident : గుండెలు పిండేసే విషాదం.. అదృశ్యమై.. ట్యాంక్‌లో శవమై.. చిన్నారిని చంపిందేవరు?

YS Jagan Master Plan: ఆరు నెలల కాకుండానే యుద్ధం చేస్తారా..? జగన్ ఏంటిది?

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

×