EPAPER

Hinupuram rape : హిందూపురం రేప్ ఘటనలో పురోగతి.. సీసీటీవీ ఫుటేజీ లభ్యం

Hinupuram rape : హిందూపురం రేప్ ఘటనలో పురోగతి.. సీసీటీవీ ఫుటేజీ లభ్యం

Hinupuram rape : సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల కోమల పల్లిలో అత్తా, కోడలిపై గుర్తు తెలియని దుండగులు హత్యాచారం జరిపిన ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పటికే చర్చకు దారి తీయగా తాజాగా ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు.


హిందూపూర్ గ్యాంగ్ రేప్ కు సంబందించి సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. 5 గురు వ్యక్తులు వాచ్ మెన్ కుటుంబంతో గొడవకు దిగారు. దీంతో  గొడవను ఆపేందుకు అత్త కోడలు ఇంట్లోంచి బయటికి వచ్చారు. ఈ సమయంలోనే గంజాయి మత్తులో ఉన్న నిందితులు వారిపై అత్యాచారానికి వడిగట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 2:45 నిమిషాలకు ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల్ని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ హిందూపురం ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టామని పోలీసులు తెలిపారు.

సత్య సాయి జిల్లా నల్ల కోమల పల్లిలో ఒక నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పని చేస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి రెండు బైకులపై వచ్చిన 5గురు దుండగులు… వాచ్ మెన్ కొడుకును కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అత్తా, కోడళ్లను లాక్కెళ్లి…. వారిపై అత్యాచారం జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ అత్యాచార ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు జరిగాయని.. ఆడవారు అన్యాయం అయిపోతున్నారని..  తన సొంత నియోజకవర్గంలో పండగ పూట ఇలాంటి ఘటన జరగటం దారుణమని మండిపడ్డారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి… కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేయాలని తెలిపారు. బాధిత కుటుంబానికి  అండగా ఉంటానని.. ఇకపై ఎలాంటి దారుణం జరగకుండా రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై ఇప్పటికే సమాజంలో బలమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వంతో పాటు యంత్రాంగం సైతం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అత్యాచారాలు ఆగటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే అత్యాచారాలపై కొత్త చట్టాలు కఠిన శిక్షలు వచ్చినప్పటికీ మార్పు రావడం లేదని మండిపడుతున్నారు.

సమాజంలో మహిళలు అన్యాయానికి గురవుతున్నారని… ఇకపై పోలీసులు నిఘా పెంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. చిన్నపిల్లల నుంచి వయసు పైబడిన వారి వరకూ ప్రతీ ఒక్కరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అన్యాయాల్లో కొందరికి మాత్రమే న్యాయం జరుగుతుందని.. మరెందరో అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి వెంటనే నిందితుల్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు.

ALSO READ : ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Related News

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP CID : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ

Kakinada News: భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం, సంచలనం రేపిన ఘటన ఎక్కడ?

Devaragattu Banni festival: దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. కర్రల ఫైటింగ్‌లో హింస.. 70 మందికి గాయాలు

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?

Big Stories

×