EPAPER

High Tension In Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి.. సీఐకి గాయాలు

High Tension In Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి.. సీఐకి గాయాలు

High Tension In Tadipatri: ఎన్నికలు ముగిసినా ఏపీలో దాడులు మాత్రం ఆగడంలేదు. వైసీపీ టీడీపీ మధ్య దాడులు పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణాన దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర హైటెన్షన్ మరువకముందే తాడిపత్రిలో మరో ఘటన చోటు చేసుకుంది.


అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జ్జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాహనం పైన వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. పోలీసులు జీపు ధ్వంసం చేశారు. దీంతో కేంద్ర బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కేంద్ర బలగాలు కూడా రాళ్లదాడిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. తాడిపత్రి సీఐకు గాయాలయ్యాయి.

దీంతో తాడిపత్రి ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. పట్టణంలో ప్రజలు తిరిగే సమయంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. అటు తాడిపత్రిలో వారం రోజల నుంచి యుద్ధ వాతావరణం తలిపిస్తుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కార్యకర్తలు మధ్య నివురు కప్పిన నిప్పులా తాడిపత్రి మారింది. తీవ్ర ఉద్రికత పరిస్థితులు మధ్య తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. దీంతో పోలీసుల నిఘాలో పట్టణ ప్రజలు ఉన్నారు.


అటు జేసీ ప్రభాకర్ రెడ్డి సహా వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరారు.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×