Big Stories

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఏపీలో గత 4 రోజులగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలపై సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది.

- Advertisement -

సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 8 నాటికి నైరుతి రుతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఆదివారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. పని ప్రదేశాలు, ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News