Avinash Reddy : వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం. లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ముందు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది.
వాదనలకు ఎంత సమయం పడుతుందని జడ్జి అడిగారు. కనీసం గంటపాటు వాదనలు వినిపిస్తామని సీబీఐ తరఫు లాయర్లు చెప్పారు. అటు అవినాష్ తరఫు న్యాయవాదులు సైతం గంటపాటు వాదనలు వినిపిస్తామని తెలిపారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. దీంతో విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చేపడతామంటూ జడ్జి వాయిదా వేశారు. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.
శుక్రవారం కచ్చితంగా అటోఇటో తేలిపోతుందని అంటున్నారు. ఇంతకీ అవినాష్‌కు బెయిల్ వస్తుందా? రాదా? సీబీఐ విచారణకు ఎంపీ వెళ్తారా? వెళ్లరా? వెళ్లకపోతే ఏం జరగుతుంది? వెళితే సీబీఐ అరెస్ట్ చేస్తుందా? ఇలా.. అవినాష్‌రెడ్డి బెయిల్, అరెస్ట్ పై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Leave a Comment