EPAPER
Kirrak Couples Episode 1

Gudur MLA Candidate : గూడూరు ఎమ్మెల్యే దారెటు? ఆ టికెట్ దక్కేదెవరికి..?

Gudur MLA Candidate : ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. గెలుపు గుర్రాలను అన్వేషించే క్రమంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కడా అసమ్మతి లేకుండా ఆశావహులను బుజ్జగిస్తూ.. కొత్త అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటైన గూడూరు ఈ సారి చేజారి పోకుండా పట్టు నిలుపుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇంతకీ గెలుపు గుర్రాల రేసులో ఉన్న ఆ అభ్యర్థులు ఎవరు?. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పార్టీ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది?

Gudur MLA Candidate : గూడూరు ఎమ్మెల్యే దారెటు?  ఆ టికెట్ దక్కేదెవరికి..?

Gudur MLA Candidate : ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. గెలుపు గుర్రాలను అన్వేషించే క్రమంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కడా అసమ్మతి లేకుండా ఆశావహులను బుజ్జగిస్తూ.. కొత్త అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటైన గూడూరు ఈ సారి చేజారి పోకుండా పట్టు నిలుపుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇంతకీ గెలుపు గుర్రాల రేసులో ఉన్న ఆ అభ్యర్థులు ఎవరు?. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పార్టీ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది?


ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల ఎంపికకు వైసీపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది.. గెలుపు గుర్రాల అన్వేషణలో సర్వే ఫలితాల ప్రాదిపదికన అభ్యర్థులను ఖరారు చేసే దిశగా వైసీపీ ముందుకు సాగుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గాన్ని అధికారపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు అప్పటి ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్.. 2019 ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావును ఎమ్మెల్యే బరిలో నిలిపి.. దాదాపు 40 వేల పైచిలుకు మెజారిటీతో సునీల్ కుమార్‌ను ఓడించింది.

రానున్న ఎన్నికల్లో సరైన అభ్యర్థిని నిలిపితేనే గెలుపు సాధ్యమని పార్టీ అధిష్టానం భావిస్తుంది.. అందకే సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాదరావుని గుడూరు నుంచి తప్పింనున్నారంట.. ఆయన స్థానంలో పార్టీకి అత్యంత విధేయుడిగా ఉండే ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ప్రతిపక్షం గట్టి పోటీ ఇచ్చి.. అసెంబ్లీలో బలాబలాలు సంఖ్యాబలాలు దగ్గరగా ఉన్నప్పుడు.. పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేల వల్ల అధికారం తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి తప్పించుకునేందుకు నమ్మకస్తుల ఎంపికకు అధినేతలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారట.


పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కేడర్లో మనోధైర్యం నింపి ముందుకు నడిపించడంలో.. మేరిగ మురళీధర్ సక్సెస్ అయ్యారన్న సర్వే రిపోర్టు జగన్‌కు అందిందంట.. అంతే కాకుండా ప్రతిపక్ష నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తుంటారని.. కేడర్‌కు అండగా ఉంటారని.. ఇలాంటి అనేక అంశాలను గుర్తించిన పార్టీ అధిష్టానం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మెరిగ మురళీధర్‌కు అవకాశం ఇచ్చింది. శాసనమండలి విప్ గా కూడా ప్రకటించి మురళీధర్‌కు సముచిత స్థానం కల్పించింది. దాంతో ఆయను ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కకపోవచ్చని అందరూ భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు ఖాయమైన నేపథ్యంలో మేరిగ మురళీధర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కన్‌ఫర్మ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

అదలా ఉంటే ఆర్డీఓ కిరణ్ కుమార్ కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో కనిపిస్తున్నారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఆయనకు టికేట్ ఇప్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారంట. ఆర్డీఓ కిరణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే గూడూరు నియోజకవర్గం నుంచి ఆర్డిఓను గెలిపించుకుంటానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే ఎవరో అధికారిని తీసుకువచ్చి కొత్త ముఖాన్ని పరిచయం చేయడం ఏంటని నియోజకవర్గ పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందంట.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఆయనకు టికెట్ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారనే చర్చ కొనసాగుతుంది.

ఆ క్రమంలో కిరణ్ కుమార్ కంటే ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ బెటర్ అన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చిందంటూ మురళీ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా గూడూరు కు పీఆర్పీ మాజీ నేమనపాటి రవీంద్ర బాబు పేరు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాలో అనేక పేర్లు హాల్ చల్ చేస్తున్నాయి. ఎవరెవరిని ఫోకస్ చేస్తూ.. అభ్యర్థుల రేసులో ఉన్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పార్టీ శ్రేణులనుఆశ్చర్యానికి, అసహనానికి గురిచేస్తుందట.. కనీస అర్హత లేని వారు కూడా అభ్యర్థులమంటూ తమవారితో ప్రచారం చేయించుకుంటున్నారంట. మొత్తమ్మీద గూడూరు వైసీపీ అభ్యర్థి ఎవరనేది సెగ్మెంట్లో ఉత్కంఠ రేపుతోంది.

Related News

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Big Stories

×