EPAPER

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ హాస్టల్.. స్పై కెమెరాలు.. కొత్త ట్విస్ట్‌, వణుకుతున్న ఆ ఇద్దరు

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ హాస్టల్.. స్పై కెమెరాలు.. కొత్త ట్విస్ట్‌, వణుకుతున్న ఆ ఇద్దరు

Gudlavalleru: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి వెళ్లిపోతుంది.. ఈ క్యాప్షన్ ప్రస్తుత రాజకీయాలకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు తప్పుడు ప్రచారంతో మొదలవుతున్నాయి. ఆ విషయం సరే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఎలాంటి స్పై కెమెరాలు లేవని తేల్చి చెప్పారు పోలీసులు. కాకపోతే కొంతమందికి టెన్షన్ పట్టుకుంది. ఇంతకీ వారెవరు? అన్నదే అసలు పాయింట్.


ఏపీలో విజయవాడ వరద సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పోలీసుల దృష్టి కేసులపై పడింది. తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారం ఏపీకి ఓ కుదుపు కుదిపేసింది. అందరి కంటే ముందు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై ఒంటికాలిపై లేచారు. అవన్నీ పుకార్లేనని తేలిపోయినట్టు తెలుస్తోంది. స్నానపు గదుల్లో ఎలాంటి స్పై కెమెరాలు లేవన్నది పోలీసుల వెర్షన్. చాలామందిని విచారించామని, వాటిని ప్రత్యక్షంగా చూసినట్టు ఏ ఒక్కరూ చెప్పలేదు. మాకు వాళ్ల ద్వారా తెలిసిందని మాత్రమే చెబుతున్నారని వివరించారు.

ALSO READ: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్


గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారంలో అదిగో పులి అంటే.. ఇదిగో మేక అన్నతరహాగా మారింది. హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినుల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ ఆగష్టు 29న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 300 వీడియోలు షేర్ చేశారని చెప్పడంతో విద్యార్థుల పేరెంట్స్ హడలిపోయారు.

స్పై కెమెరాల వ్యవహారాన్ని చంద్రబాబు సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, పూణెకు చెందిన సీ-డాక్ సాంకేతిక నిఫుణులు రంగంలోకి దిగారు. ఒక క్రిమినల్ కేసులో సీఈఆర్టీ పని చేయడం ఏపీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. కేంద్ర సర్వర్లు, స్టూడెంట్స్ హాస్టల్స్, విద్యార్థుల సెల్‌‌ఫోన్లు, ల్యాప్ టాప్‌లను పరిశీలించారు. మూడు రోజులపాటు దర్యాప్తు చేశారు. అనుమానం ఉన్న 14 మొబైల్, 6 ల్యాప్ టాప్‌లను ల్యాబ్‌కు పంపారు. వచ్చేవారానికి నివేదిక రానుంది.

మరో ఐదురోజుల తర్వాత గుడ్లవల్లేరు హాస్టల్ వ్యవహారం గుట్టు బయటపడనుంది. ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులపై అనుమానాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో చదువుతున్న ఓ అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమించుకున్నారట. వారిద్దరి ఫ్యామిలీలు ఒకే పొలిటికల్ పార్టీలో ఉన్నారని సమాచారం. దీంతో వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు ఫ్రెండ్స్ ద్వారా షేర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.  చివరకు ఈ విధంగా దుమారం రేగిందని అంటున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు లోపల ఎలాంటి కెమెరాలు లేవన్నది కొందరు స్టూడెంట్స్ ఓపెన్‌గా చెబుతున్నారు.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్‌ను మంత్రులు పలుమార్లు పర్యటించారు. గుడ్లవల్లేరు వ్యవహారం నేపథ్యంలో అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోసింది వైసీపీ. కెమెరాలు లేవని రిపోర్టు గనుక వస్తే.. దాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అస్త్రాలను వైసీపీ సిద్ధం చేస్తోందని సమాచారం.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×