EPAPER

GSLV-F14 : ఇస్రో కీర్తికిరీటంలో మరో కీలక ప్రయోగం.. GSLV-F14 సర్వం సిద్ధం

GSLV-F14 : ఇస్రో కీర్తికిరీటంలో మరో కీలక ప్రయోగం.. GSLV-F14 సర్వం సిద్ధం
GSLV-F14 launch update

GSLV-F14/INSAT-3DS Mission: ప్రతిష్టాత్మక జిఎస్‌ఎల్వి-ఎఫ్‌ 14 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైన కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5గంటల 35 నిమిషాలకు జిఎస్‌ఎల్వి-ఎఫ్‌ 14ను నింగిలోకి పంపడం ద్వారా ముగియనుంది. సరిగ్గా 27 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. షార్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌-3డిఎస్‌ను ఇస్రో పంపనుంది.


ఇస్రో కీర్తి కిరీటంలో ఈ ఉపగ్రహం మరో కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఇన్సాట్‌ తరహా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి భూ కేంద్రాలకు కచ్చితమైన సమాచారం అందించడానికి కేంద్రం ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరుపుతున్నారు.

వాతావరణ సంబంధమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2275 కేజీలుగా ఉంది. పీఎస్‌ఎల్ వీ రాకెట్‌ ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జిఎస్‌ఎల్వీని మూడు దశలోనే ప్రయోగించనున్నారు. 51.7 మీటర్ల పొడవైన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలుదేరనుంది.


Read More:  ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు

వాతావరణ అంచనాలు, విపత్తులను ముందుగా హెచ్చరించడానికి ఇది ఉపయోగపడుతుంది. జీఎస్‌ఎల్‌వి మార్కు2 సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం కావడం విశేషం. జీఎస్ఎల్వి -ఎఫ్ 14 ప్రయోగ నేపథ్యంలో షార్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన శాస్త్రవేత్తలు ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి చేరుకున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×