EPAPER

YSR Awards : వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డ్స్‌.. గవర్నర్ చేతులమీదుగా అందుకున్నది వీరే..

YSR Awards : వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డ్స్‌.. గవర్నర్ చేతులమీదుగా అందుకున్నది వీరే..

YSR Awards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డ్స్‌ను ప్రదానం చేసింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వైఎస్‌ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం వైఎస్ జగన్‌, గవర్నర్. సాగునీటి రంగం, వ్యవసాయం, వైద్యం, విద్య, 108 లాంటి సేవలు అందించిన వైఎస్అర్ ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం జగన్ అన్నారు.


అనంతరం వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌, 4 అచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికైన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్.. సీఎం జగన్‌తో కలిసి అవార్డులు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఆయన పురస్కారాలను అందజేశారు. వైఎస్సార్‌ హయంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందన్నారు. మూడేళ్లుగా ఈ అవార్డులను అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అవార్డులు అందుకున్నవారిలో జీవితాలను అర్పించినవారు, మన హెరిటేజ్ ను భుజాలపై మోసిన వారు ఉన్నారన్నారు. వారంతా మన జాతిసంపద అని సీఎం కొనియాడారు.

అవార్డులు అందుకున్నది వీరే..


అగ్రికల్చర్ విభాగంలో పంగి వినీత వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డును అందుకున్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన వైవీ మల్లారెడ్డి గవర్నర్ చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు.

యడ్ల గోపాలరావు (స్టేజ్ ఆర్టిస్ట్, శ్రీకాకుళం జిల్లా), తాలిశెట్టి మోహన్ (కలంకారి, తిరుపతి జిల్లా), కోటా సచ్చిదానంద శాస్త్రి (హరికథ, బాపట్ల జిల్లా), కోన సన్యాసి (తప్పెటగుళ్లు, శ్రీకాకుళం జిల్లా), ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటి (కాకినాడ), ఎస్ వీ రామారావు (పెయింటింగ్, కృష్ణాజిల్లా), రావు బాల సరస్వతి (ప్లే బ్యాక్ సింగర్, నెల్లూరు జిల్లా), తళ్లావజ్జుల శివాజీ (జర్నలిస్ట్ అండ్ రైటర్, ప్రకాశం జిల్లా), చెంగిచెర్ల కృష్ణారెడ్డి (ఫోక్ ఆర్ట్స్, అనంతపురం జిల్లా), మహబూబ్, షేక్ సుబాని (నాదస్వరం, ప్రకాశం జిల్లా) ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో వైఎస్సార్ అవార్డులు అందుకున్నారు.

ప్రొఫెసర్ బి.రామబ్రహ్మం (పశ్చిమగోదావరి జిల్లా), ఖాదిర్ బాబు (అచీవ్ మెంట్ అవార్డు, నెల్లూరు జిల్లా), మహావ్ జబీన్ (అచీవ్ మెంట్ అవార్డు, నెల్లూరు జిల్లా),నామిని సుబ్రహ్మణ్యం నాయుడు (చిత్తూరు జిల్లా), అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం జిల్లా) తెలుగు భాష అండ్ లిటరేచర్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. అలాగే మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో ఇండ్ల రామసుబ్బారెడ్డి (సైకియార్టిస్ట్, ఎన్టీఆర్ జిల్లా), ఈసీ వినయర్ కుమార్ రెడ్డి (ఈఎన్ టీ స్పెషలిస్ట్, వైఎస్సార్ జిల్లా), మీడియా రంగంలో గోవిందరాజు చక్రధర్ (కృష్ణాజిల్లా), హెచ్ఆర్ కే (కర్నూల్ జిల్లా), సోషల్ సర్వీస్ విభాగంలో బెజవాడ విల్సన్ (ఎన్టీఆర్ జిల్లా), శ్యామ్ మోహన్ (అచీవ్ మెంట్ అవార్డు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, నిర్మల్ హృదయ్ భవన్ (ఎన్టీఆర్ జిల్లా), జి.సమరం (ఎన్టీఆర్ జిల్లా) వైఎస్సార్ అవార్డులు అందుకున్నారు.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×