EPAPER
Kirrak Couples Episode 1

AvinashReddy: అవినాష్‌రెడ్డి అరెస్ట్ వద్దు.. హైకోర్టులో కాస్త ఊరట.. బెయిల్‌పై తుదితీర్పు వాయిదా..

AvinashReddy: అవినాష్‌రెడ్డి అరెస్ట్ వద్దు.. హైకోర్టులో కాస్త ఊరట.. బెయిల్‌పై తుదితీర్పు వాయిదా..
avinash reddy

AvinashReddy: వివేక హత్య కేసులో అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ నెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకూ ప్రతీరోజు విచారణకు హాజరుకావాలని అవినాష్‌కు కండిషన్ విధించింది. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేయాలని తెలిపింది. 25న ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు ఇస్తామని చెప్పింది హైకోర్టు.


అంతకుముందు, బుధవారం ఉదయం పదిన్నరకు అవినాష్‌రెడ్డిని విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నందున.. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోర్టులోనే ఉన్నందున.. అవినాష్‌రెడ్డి విచారణను వాయిదా వేసుకుంది సీబీఐ. బుధవారం నాటి విచారణకు అవినాష్ సహకరిస్తారని అతని తరఫు లాయర్లు తెలిపారు.

హైకోర్టు తీర్పుకు ముందు వాడివేడి వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతోనే అవినాష్‌ను ఇరికిస్తున్నారని.. ఆయన తరుఫు లాయర్‌ కోర్టుకు తెలిపాడు. హత్యతో సంబంధమున్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారన్నారు. ప్రధాన నిందితుడు దస్తగిరి మీడియాతో మాట్లాడిన విషయాన్ని సునీత సమర్థించారని.. హంతుకులను వదిలేసి.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వెంట పడ్డారని వాదనలు వినిపించారు. వ్యాపార లావాదేవీల్లో గంగిరెడ్డితో వివేకాకు విభేదాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.


దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌ నేరం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అవినాష్ తరుపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దర్యాప్తులో గూగుల్‌ టేకవుట్‌ డేటాపై ఆధారపడటం సరికాదన్నారు. సునీల్‌ యాదవ్‌ కదలికలపై దస్తగిరి స్టేట్మెంట్ , గూగుల్‌ డేటా విరుద్ధంగా ఉన్నాయన్నారు. మరి దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్‌ డేటా తప్పా? ప్రశ్నించారు అవినాష్ లాయర్లు. కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు అంటూ కోర్టుకు తెలిపారు. బంధువు కాబట్టే.. హత్య తర్వాత ఘటనా స్థలానికి అవినాష్‌ వెళ్లాడన్నారు. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారని అవినాష్‌ తరఫు లాయర్‌ కోర్టుకు వివరణ ఇచ్చారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలున్నాయని సీబీఐ వాదనలు వినిపించింది. సైంటిఫిక్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసామని న్యాయస్థానానికి వెల్లడించింది. హత్యకేసులో 40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించామన్న సీబీఐ.. హత్య జరిగాక సాక్ష్యాలు తారుమారు చెయ్యటంలో అవినాష్ రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపింది. వివేకా తలకు బ్యాండేజ్ వేసి.. సహజమరణంగా చిత్రికరించారని సీబీఐ వాదించింది. ఉదయ్‌కుమార్‌ తండ్రి జయప్రకాష్ రెడ్డి చేత ఇదంతా చేయించారని తెలిపింది. గతంలో నాలుగుసార్లు ప్రశ్నించినప్పుడు అవినాష్‌ సహకరించలేదని, వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి తెలుసని.. ఆయన నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించారు.

సునీత తరఫు లాయర్లు కూడా తమ వర్షన్ వినిపించారు. సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడల్లా కోర్టుకు వస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ మర్డర్ వెనకాల ఉన్న నిందితులు అత్యంత పలుకుబడి కలిగిన వాళ్లని.. అందులో అవినాష్‌ కూడా ఒకరు అంటూ వాదనలు వినిపించారు. అప్పటి సిట్‌ను ఇన్వెస్ట్‌గేషన్‌ చేయకుండా.. అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకే.. ఈ కేసును సుప్రీంకోర్టు.. తెలంగాణకు బదిలీ చేసిందని… సునీతారెడ్డి తరుఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూడు వర్గాల వాదనల విన్న కోర్టు.. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకున్నా.. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని.. అప్పటి వరకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 25న రానున్న తుది తీర్పుపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

మరోవైపు, వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌లను 6 రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది హైకోర్టు. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే ప్రశ్నించాలని షరతులు విధించింది కోర్టు.

మరి, తండ్రి భాస్కర్‌రెడ్డి.. కొడుకు అవినాష్ రెడ్డిలను కలిసి విచారిస్తారా? విడివిడిగా ప్రశ్నిస్తారా? సీబీఐ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×