EPAPER

Giddalur Assembly Constituency : గిద్దలూరులో గెలిచేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఫలితాలివే..!

Giddalur Assembly Constituency : గిద్దలూరులో గెలిచేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఫలితాలివే..!
Giddalur Assembly Constituency

Giddalur Assembly Constituency : ఏపీ రాజకీయాల్లో గిద్దలూరుకు స్పెషాలిటీ ఎంతో ఉంది. గిద్దలూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లమల అడవులు, తర్వాత కంభం చెరువు. గతంలో నక్సల్స్ ప్రాబల్య ప్రాంతం. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గిద్దలూరుతో అనుబంధం ఉంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన దేవాలయాలు చాలానే చుట్టుపక్కల ఉన్నాయి. వర్షం పడితే వజ్రాలు కూడా దొరుకుతాయన్న ఉద్దేశంతో వజ్రాల వేటకు వెళ్లే ప్రజలున్న ప్రాంతం. కాపు, రెడ్డి, యాదవ, బలిజ కులస్తులు అధికం. ఆర్మీ ఉద్యోగులు గిద్దలూరు నుంచి అధిక సంఖ్యలో ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గిద్దలూరు రాజకీయాలు కూడా ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఇక్కడ నేతను జనం నమ్మితే గుంపగుత్తగా ఓటు వేస్తారనడానికి గత ఎన్నికలే నిదర్శనం. మరి ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

అన్నా రాంబాబు VS ముత్తుముల అశోక్ రెడ్డి


YCP 68%
TDP 27%
OTHERS 5%

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నా రాంబాబు ఏకంగా 68 శాతం ఓట్ షేర్ సాధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 73 శాతం ఓట్లు సాధిస్తే ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచింది అన్నా రాంబాబే. ఆ స్థాయి సపోర్ట్ వైసీపీకి గిద్దలూరు జనం ఇచ్చారు. టీడీపీకి 27 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో గిద్దలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

అన్నా రాంబాబు (YCP)

అన్నా రాంబాబు ప్లస్ పాయింట్స్

  • గిద్దలూరులో 100 పడకల హాస్పిటల్ పూర్తవడం
  • ప్రతి ఊళ్లో గ్రామ సచివాలయం నిర్మాణం
  • సెగ్మెంట్ లో బీటీ రోడ్లు బాగుండడం
  • స్కూల్స్, హాస్పిటల్స్ లో మౌలిక వసతులు పెరగడం

అన్నా రాంబాబు మైనస్ పాయింట్స్

  • రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలు, పోటీపై అనిశ్చితి
  • వైఎస్ హయాంలో మొదలైన వెలిగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తికాకపోవడం
  • వెలిగొండ కోసం భూములు కోల్పోయిన వారిలో చాలా మంది పరిహారం కోసం ఎదురుచూపులు
  • పరిశ్రమలు లేకపోవడం సమస్య
  • ఉపాధి కోసం యువత వలస బాట

కారుమూరి రమణారెడ్డి (YCP)

కారుమూరి రమణారెడ్డి ప్లస్ పాయింట్స్

  • వైఎస్ మరణం తర్వాత పార్టీకి అండగా కారుమూరి
  • పదేళ్ల క్రితమే లేబర్స్ కోసం గిద్దలూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు
  • అన్నదానం కమ్మిట్ మెంట్ పై జనంలో పాజిటివ్ సిగ్నల్స్
  • ప్రతి రోజు వెయ్యి మందికి భోజనాలు
  • నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు

కారుమూరి రమణారెడ్డి మైనస్ పాయింట్స్

  • రాజకీయ అనుభవం లేకపోవడం

ఐవీ రెడ్డి (YCP)

ఐవీ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • 2019లో గిద్దలూరు అసెంబ్లీ వైసీపీ ఇంఛార్జ్ గా పని చేసిన అనుభవం
  • పార్టీ క్యాడర్ నేతలతో సత్సంబంధాలు
  • పార్టీని నియోజకవర్గంలో ప్రమోట్ చేయడం

ఐవీ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ప్రత్యర్థులను ఎంత వరకు తట్టుకుంటారన్న డౌట్లు

ముత్తుముల అశోక్ రెడ్డి (TDP)

ముత్తుముల అశోక్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • ప్రజల్లో మంచి ఇమేజ్ కలిగి ఉండడం
  • టీడీపీ టిక్కెట్ కు పోటీ లేకపోవడం
  • ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను నమ్ముకోవడం

ముత్తుముల అశోక్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • టీడీపీ, జనసేన క్యాడర్ ఎంత వరకు కలిసి వస్తాయన్న డౌట్లు

కుల సమీకరణాలు

కాపు 19 %
రెడ్డి 17%
ఎస్సీ 16%
యాదవ్ 15%
ఆర్యవైశ్య 11%

గిద్దలూరు సెగ్మెంట్ లో కాపులు బలంగా ఉన్నారు. వీరిలో 40 శాతం మంది వైసీపీకి, 55 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. అటు రెడ్డి వర్గంలో 55 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు అండగా ఉంటామన్నారు. ఇక ఎస్సీల్లో 55 శాతం జగన్ పార్టీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు యాదవ్స్ లో 40 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఆర్యవైశ్యుల్లో వైసీపీ, టీడీపీకి చెరో 50 శాతం చొప్పున సపోర్ట్ ఇస్తామని తమ అభిప్రాయంగా చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

అన్నా రాంబాబు VS ముత్తుముల అశోక్ రెడ్డి

YCP 51%
TDP 46%
OTHERS 3%

గిద్దలూరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది అభ్యర్థిని బట్టి పర్సంటేజ్ మారుతోంది. ఒక పాజిబుల్ సినారియో ప్రకారగం అన్నా రాంబాబు వైసీపీ టిక్కెట్ పై పోటీ చేస్తే 51 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే టీడీపీ అభ్యర్థికి 46 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 3 శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గిద్దలూరు వైసీపీ కంచుకోటగా మారడంతో ఇదే ఫలితం రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు కూడా అధికార పార్టీ ఓట్లను పెంచుతోంది.

కారుమూరి రమణారెడ్డి VS ముత్తుముల అశోక్ రెడ్డి

YCP 49%
TDP 46%
OTHERS 5%

ఇక వైసీపీ నుంచి అన్నా రాంబాబు పోటీపై అనిశ్చితి ఉండడం, ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీలో కారుమూరి రమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కారుమూరి పోటీ చేసినా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. మొత్తం 49 శాతం ఓట్ షేర్ ను ఆయన రాబడుతారని, అదే సమయంలో టీడీపీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి 46 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఇతరులు 5 శాతం ఓట్లు సాధించే ఛాన్స్ ఉంది.

ఐవీ రెడ్డి VS ముత్తుముల అశోక్ రెడ్డి

YCP 44%
TDP 49%
OTHERS 7%

ఇక వైసీపీ నుంచి ఐవీ రెడ్డి పోటీ చేస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, వైసీపీ అభ్యర్థి ఐవీ రెడ్డికి 44 శాతం ఓట్లు వస్తాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇతరులకు 7 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఐవీ రెడ్డి సెగ్మెంట్ లో అంతబలంగా లేకపోవడంతో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.

.

.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×