EPAPER

Ganta Srinivasa Rao : గంటా సీటుకు ఎసరు? టీడీపీలో మార్పులు చేర్పులు..!

Vizianagaram : టీడీపీలో నెంబర్ టు ఆయన. ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు పడుతుందా? ఔననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఆయన ఎవరు..? ఆయనకు చెక్ పెట్టే నేత ఎవరు? విజయనగరం జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న మార్పులపై చర్చ జరుగుతోంది.

Ganta Srinivasa Rao : గంటా సీటుకు ఎసరు? టీడీపీలో మార్పులు చేర్పులు..!
latest political news in andhra pradesh

Ganta Srinivasa Rao News(Latest political news in Andhra Pradesh) :

టీడీపీలో నెంబర్ టు ఆయన. ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు పడుతుందా? ఔననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఆయన ఎవరు..? ఆయనకు చెక్ పెట్టే నేత ఎవరు? విజయనగరం జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న మార్పులపై చర్చ జరుగుతోంది.


ఏపీ పాలిటిక్స్‌లో మార్పులు చేర్పులు బాగా కనిపిస్తున్నాయి. సర్వే రిపోర్ట్స్‌ ప్రకారం ఇప్పటికే జగన్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎన్నికల టైంకు మరికొంత మందిని మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది తెలుగుదేశం పార్టీ. అందులోభాగంగానే విశాఖ నార్త్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు.. విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారనే కొత్త చర్చ మొదలైంది. గంటా విజయనగరం రావడం ఏంటి అనే డౌట్స్‌ ఉన్నా.. ఇది నిజమే అంటున్నారు అతని దగ్గరి సన్నిహితులు. అశోక్‌ గజపతిరాజుకు వయసు అయిపోవడం, పెద్దగా యాక్టివ్‌గా లేరనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనివెనక మరో కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కాపు సామాజిక వర్గ నేతలు కొద్ది నెలల నుంచి అశోక్‌ ప్రాబల్యం తగ్గించేందుకు ట్రై చేస్తున్నట్టు ఆయన వర్గీయులే గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యంగా మినీమహానాడు సమయంలో సాక్షాత్తూ కాపు నేత కళా వెంకటరావుకు, అశోక్‌ కు మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. అందుకే కాపు నాయకులు అశోక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ నడుస్తోంది. అంతేకాకుండా అశోక గజపతిరాజు కుమార్తె అధితి గజపతిరాజుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారన్న టాక్‌ రావడం కూడా పార్టీలోని కొందరికీ నచ్చడం లేదని సమాచారం. కనీసం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారనే వాదన మొదలైనట్లు తెలుస్తోంది.


2019 ఎన్నికల్లో ఎంపీగా అశోక గజపతిరాజు, ఎమ్మెల్యేగా అధితి.. ఇద్దరూ ఓడినా మళ్లీ వారికే టికెట్లు ఇస్తారా అనే వ్యతిరేకత కూడా కొందరిలో ఉంది. ఈ విషయంలో 2019లో సిట్టింగ్ గా ఉండి కూడా టికెట్ రాక భంగపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా విజయనగరం నియోజకవర్గ అసంతృప్త నాయకులకు ఆశ్రయమిస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు స్కిల్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో గీత వైసీపీకి వ్యతిరేఖంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాలకు బంగ్లా నాయకులు కూడా హాజరైనప్పటికీ.. తప్పక వచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు అశోక్ గానీ, అయన కుమార్తె, విజయనగరం నియోజకవర్గ ఇంచార్జ్ కూడా కనీసం ఒక్కటంటే ఒక్క పార్టీ ఈవెంట్‌ కూడా నిర్వహించకపోవడం వ్యతిరేఖ వర్గీయులకు ఆయుధంగా మారింది. అయితే అశోకగజపతిరాజుకు చెక్‌ పెట్టేందుకు ఇదే అదునుగా అక్కడి తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. అందుకే గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తోంది.

ఒకవేళ గంటా నిజంగానే విజయనగరంలో పోటీ చేస్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. విజయనగరంలో కాపు ఓటర్లు ఎక్కవుగా ఉంటారు. ఇది గంటాకు కలిసొచ్చే అంశం. అయితే ఈ ప్రచారం అనుకోకుండా జరిగిందా.. లేక పార్టీ నిర్ణయామా అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. అశోక గజపతి రాజు వయసు 75 దాటడం కూడా పక్కనపెట్టేందుకు ఓ కారణంగా భావిస్తున్నారు. మొత్తానికైతే విజయనగరానికి గంటా రావడం ఖాయమా ..లేక ఇవన్నీ ఊహాగానాలా అనేది ఇప్పుడే చెప్పలేం.

మరోవైపు పార్టీలో నంబర్ టు గా ఉన్న అశోక్ ని కాదని విజయనగరంలో వేరొకరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదనేది అయన వర్గీయుల వాదన. పార్టీ కోసం నిజాయితీగా పని చేసే వ్యక్తి అశోక్ అని, సమయం ఉన్నా పార్టీ ఆదేశించడంతో 2018 లో కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారని అయన ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. అయితే కుల సమీకరణాల, లేక లాయల్టీయా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే .

Ganta Srinivasa Rao, denied ticket, TDP Vizinagaram, Ashoka Gajapathi Raju,

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×