EPAPER

Ganta Srinivasa Rao : గంటా దారెటు..? నియోజకవర్గం కోసం మాజీ మంత్రి తిప్పలు..!

Ganta Srinivasa Rao : రాజకీయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పొలిటికల్ అరంగేట్రం చేసిన గంటా తర్వాత అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. 2004 ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో అడుగుపెట్టిన ఆయనకు ఇప్పటి వరకు ఓటమి అన్నదే తెలియదు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చేయడం ఆయన స్టైల్. అలాగే టైంని బట్టి పార్టీలు కూడా మార్చేస్తుంటారు.

Ganta Srinivasa Rao : గంటా దారెటు..? నియోజకవర్గం కోసం మాజీ మంత్రి తిప్పలు..!
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao : రాజకీయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పొలిటికల్ అరంగేట్రం చేసిన గంటా తర్వాత అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. 2004 ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో అడుగుపెట్టిన ఆయనకు ఇప్పటి వరకు ఓటమి అన్నదే తెలియదు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చేయడం ఆయన స్టైల్. అలాగే టైంని బట్టి పార్టీలు కూడా మార్చేస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పగల సమర్థులు. ప్రతి ఎన్నికల్లో సెగ్మెంట్ మార్చినా అయన్ని అదృష్టం వరిస్తూనే వస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ నుంచి షిఫ్ట్ అవుతామని చూస్తుంటే.. అనుకూలమైన నియోజకవర్గం కనబడటం లేదంట. దాంతో ఆయన ఎక్కడ నుంచి పోటీచేస్తారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఆ పేరు తెలియని వారుండరు. రాజకీయాల్లో అంతటి పేరున్న ఈ మాజీ మంత్రికి ఇప్పుడు పోటీ చేయడానికి నియోజకవర్గం దొరకడం లేదంట. పాలిటిక్స్‌లో గంటా స్టైలే డిఫరెంట్‌గా ఉంటుంది. 1999 నుండి నేటి వరకు గంటా పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 1999లో ఎంపీగా, తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం ఏదీ అంటే చెప్పలేం.

టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గంటా ఫస్ట్ టైం అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్యేగా చోడవరం, అనకాపల్లి, భీమిలీ నుంచి గెలిచి.. ప్రస్తుతం విశాఖ నార్త్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మాజీ అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలోకి వెళ్లి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో వీలినం అవ్వగానే.. కాంగ్రెస్ మంత్రి అయిపోయారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. 2014 నాటికి తిరిగి టీడీపీలోకి వచ్చి భీమిలి ఎమ్మెల్యేగా చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. అలా ప్రతిసారి కొత్త నియోజకవర్గం నుండి పోటీ చేయడమే గంటాకు కలసి వస్తోందని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు.


పోల్ మేనేజ్మెంట్‌పై మంచి పట్టున్న గంటాకు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం దొరకడం లేదంటున్నారు ఆయన అనుచరులు. పోటీ చేసిన నియోజకవర్గం నుండే మళ్ళీ పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవడం తప్ప గంటాకు వేరే దారి కనిపించడం లేదంట. అంటే విశాఖ నార్త్ నుంచే ఆయన బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సారి సెగ్మెంట్ మార్చకపోయినా.. ఆయన్ని లక్ వరించే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

గంటా శ్రీనివాసరావు 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ నెల 23న స్పీకర్ రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు. దాంతో నార్త్ సెగ్మెంట్లో స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గంటాకి అంతో ఇంతో ప్లస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి గంటా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదంట. దీంతో గంటా శ్రీనివాసరావుకు ఎక్కడ సీటు ఇవ్వాలి అనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం పడితే.. అసలు ఎక్కడ నుండి పోటీ చేయాలా అని గంటా వెతుక్కుంటున్నారంట.

గంటా 2014 ఎన్నికలప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యి భీమిలి నుండి పోటీ చేసి గెలిచి మళ్ళీ మంత్రి అయ్యారు. మళ్ళీ అదే సెంటుమెంటుని గంటా ఫాలో అయ్యేలా కనిపిస్తుంది. 2014 భీమిలి నుండి గెలిచి మంత్రి అవ్వడంతో 2024లో కూడా భీమిలి నుండి పోటీ చేస్తే భావుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారంట. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్న నేపథ్యలో గంటా గెలుపు ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే భీమిలిలో గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసిన డాక్టర్ పంచకర్ల సందీప్‌కు కూడా మంచి పేరు ఉంది. గత ఎన్నికల్లో మంచి ఓట్లు కూడా సంపాదించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ భీమిలి టిక్కెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేనకు భీమిలి టిక్కెట్ కేటాయిస్తే మరి గంటా పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతుంది.

చిరంజీవికి సన్నిహితుడైన గంటా భీమిలి నుండి పోటీ చేయాలి అనుకుంటే చిరంజీవి చేత పవన్ కళ్యాణ్ కి చెప్పించి సీటు కన్ఫామ్ చేసుకోగలరనే టాక్ వినిపిస్తుంది. 2014 ఎన్నికల తర్వాత.. టీడీపీ, జనసేనల పొత్తు తెగిపోయినప్పటికీ .. అప్పటి నుండి ఇప్పటి వరకు గంటా జనసేన పార్టీ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు. అందుకే అన్నయ్య చిరంజీవితో చెప్పిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ వినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలకు భీమిలి టిక్కెట్ గంటాకే వస్తుందని గంటా అనుచరులు భావిస్తున్నారంట.మొత్తానికి ఆర్థికంగా బలవంతుడైనా 25 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్న గంటా ఈరోజు సీటు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తడం నిజంగా విశేషమే. మరి విశాఖ నార్త్, భీమిలి కాకుండా ఇంకా గంటా మనసు ఏ నియోజకవర్గంపై పారేసుకుంటారో చూడాలి.

.

.

Related News

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Big Stories

×