EPAPER

Galla Jayadev : రాజకీయ వనవాసమే.. ఈ బ్రేక్ తాత్కాలికమే..!

Galla Jayadev : తన పొలిటికల్ కెరీర్‌పై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చేశారు.. కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్లే .. టీడీపి ఎంపి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.. రాజకీయాలు, వ్యాపారాలపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టమని, ప్రజలను కలవలేకపోతున్నానంటూ.. తన నిర్ణయం వెల్లడించారు.. అయితే ఎంపీగా మళ్లీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ .. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Galla Jayadev : రాజకీయ వనవాసమే.. ఈ బ్రేక్ తాత్కాలికమే..!

Galla Jayadev : తన పొలిటికల్ కెరీర్‌పై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చేశారు.. కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్లే .. టీడీపీ ఎంపి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.. రాజకీయాలు, వ్యాపారాలపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టమని, ప్రజలను కలవలేకపోతున్నానంటూ.. తన నిర్ణయం వెల్లడించారు. అయితే ఎంపీగా మళ్లీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ .. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.


టీడీపీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ బడా ఇండస్ట్రియలిస్ట్.. టీడీపీలో చేరి గుంటూరు నుంచి వరుసగా రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.. అయితే ఈ సారి పోటీకి ఆయన ఆసక్తిగా లేరని కొంతకాలంగా ప్రచారం జరిగింది.. ఇప్పుడు దానిపై గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు .. తాత్కాలికంగా పొలిటికల్ బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.. ఆ క్రమంలో తనను ఆదరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. టీడీపీ శ్రేణులకు క్యాడర్‌కు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.. దానికితెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను, తన వ్యాపారాలను టార్గెట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన.. తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు..


మళ్లీ పోటీ చేసినా గెలుస్తానంటున్న జయదేవ్.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.. రెండేళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్‌ అయ్యారని.. ఈ నేపథ్యంలో పాలిటిక్స్‌ని, బిజినెస్‌లను సమన్వయం చేసుకోవడం కష్టమవుతోందని.. అందుకే టెంపరరీగా రాజకీయాలను వదిలేస్తున్నానన్నారు.

రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో గట్టిగానే వాయిస్ వినిపించారు జయదేవ్.. రాజధానిగా అమరావతికి మద్దతిచ్చారు .. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకి వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టిన సమయంలో లోక్‌సభలో టీడీపీ వాయిస్ ఆయనే వినిపించారు.. దాంతో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు.. వివిధ కేసుల్లో ఈడీ ఆయన్ని రెండు సార్లు పిలిచి విచారించింది..

అవన్నీ గుర్తు చేస్తూ.. తనవ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని.. సీబీఐ, ఈడీ తన ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నాయని జయదేవ్ చెప్పుకొచ్చారు.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే గల్లా జయదేవ్.. ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణంగా కనిపిస్తుంది.. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న గుంటూరు ఎంపీ.. తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజీనామా చేయకపోవడం విశేషం.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×