EPAPER

Gali Janardhan Reddy | వైసీపీలో కర్ణాటక ఎఫెక్ట్.. మైనింగ్ కింగ్ ఆదేశాలను పాటిస్తున్న జగన్!

Gali Janardhan Reddy | వైసీపీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీఐపీల హవా నడుస్తోందా?.. వచ్చే ఎన్నికలకు టికెట్ల కేటాయించే విషయంలో వారు చెప్పిన వారే అభ్యర్ధులు అవుతున్నారా? .. అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.

Gali Janardhan Reddy | వైసీపీలో కర్ణాటక ఎఫెక్ట్.. మైనింగ్ కింగ్ ఆదేశాలను పాటిస్తున్న జగన్!

Gali Janardhan Reddy | వైసీపీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీఐపీల హవా నడుస్తోందా?.. వచ్చే ఎన్నికలకు టికెట్ల కేటాయించే విషయంలో వారు చెప్పిన వారే అభ్యర్ధులు అవుతున్నారా? .. అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. కర్ణాటక బడాబాబుల ఎఫెక్ట్‌తో అప్పటికే ప్రకటించిన వైసీపీ అభ్యర్థులు కూడా మారిపోతుండటమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాంతో అక్కడి వారి సిఫార్సులతో టికెట్లు దక్కించుకున్న వారు హ్యాపీ అయిపోతుంటే. అప్పటి దాకా అక్కడ ఉన్న ఆశావహులు కర్ణాటక నుంచి చక్రం తిప్పుతున్న వారిని తెగ తిట్టేసుకుంటున్నారు.


ఉమ్మడి అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు. దాదాపు ఆ రాష్ట్రంలో కలిసిపోయినట్లే ఉంటుంది. భాష , యాస కూడా ఒకేలా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేందుకు ఎంతోమంది జిల్లా వాసులు, విఐపీలు బెంగళూరు, బళ్లారి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రాజకీయంగా కూడా సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అంతేకాదు జిల్లా రాజకీయాల్లో కర్ణాటక ప్రభావం కూడా కనిపించేది. బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి టీంతో జగన్‌కు ఉన్న అనుబంధంతో ఆ ప్రభావం ఫోకస్ అవుతూ వస్తోంది.

అయితే ఈ సారి మాత్రం ఆ ఎఫెక్ట్ మరింత పెరిగిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో కర్ణాటక బాస్‌ల పెత్తనం నడుస్తోంది. జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్ల వైసీపీ కేండెట్ల ఎంపిక వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటకకు మరీ దగ్గరగా ఉంటే హిందూపురం, రాయదుర్గం, గుంతకల్, ఉరవకొండ, మడకశిర ప్రాంతాలలో ఆ రాష్ట్ర నేతలు ఎవరి పేరు సూచిస్తే వారికే వైసీపీ టికెట్లు దక్కుతున్నాయంటున్నారు.


ముఖ్యంగా కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు, ఇతర లావాదేవీలతో వైసీపీ అధినేత జగన్ వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటున్నారు. ఆర్థికంగా కూడా అక్కడి నుంచి సహకారం పుష్కలంగా ఉండడంతో వైసీపీ బాస్ .. లోకల్ , నాన్ లోకల్ అన్న తేడా లేకుండా .. ఎవరెవరినో తీసుకొచ్చి అభ్యర్ధులుగా ప్రకటించేస్తున్నారంట. కర్ణాటక కోటాలో ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలకు టికెట్లు ఖరారయ్యాయి. రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, మడకశిర వైసిపి అభ్యర్థి ఈర లక్కప్ప, హిందూపురం వైసీసీ ఇంచార్జి దీపికలకు అక్కడి పెద్దల ఆశీస్సులతోనే పోటీ చేసే అవకాశం లభించిందంట.

రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రరెడ్డి కూడా 2009 నుంచి కర్ణాటక పెద్దలతో ఉన్న సంబంధాలతోనే టికెట్ దక్కించుకుంటూ వచ్చారంటారు. ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు కాపురామచంద్ర రెడ్డికి సంబంధాలు చెడిపోవడంతో వైసీపీ టికెట్ దక్కకుండా పోయిందంట. ముఖ్యంగా మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డికి వ్యాపార సంబంధాలు ఉండేవి. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో .. గాలి ఎఫెక్ట్‌తోనే కాపుకి టికెట్ దక్కకుడా పోయిందన్న టాక్ వినిపిస్తోంది.

హిందూపురం వైసీసీ ఇంచార్జిగా వచ్చిన దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయి. దాంతో అక్కడి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేయడంతో టికెట్ వచ్చిందంట. టికెట్ ఇప్పించుకోవడమే కాదు.. ఇప్పుడు దీపిక గెలుపు బాధ్యతలను కూడా పెద్దిరెడ్డే భుజానికెత్తుకున్నారంటే.. కర్ణాటక బాబుల సిఫార్సు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక వైసీపీ నాలుగో జాబితాలో మడకశిర వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఈర లక్కప్ప అనే కొత్త ముఖాన్ని ప్రకటించారు. ఆయన కర్ణాటక బిజినెస్‌మాన్ శివకుమార్ రికమండేషన్‌తో వైసీపీ లిస్ట్‌లో ప్లేస్ దక్కించుకున్నారంట. మడకశిర నియోజకవర్గానికి సంబంధించి కరోనా సమయంలో మడకశిర సీఐగా పనిచేసిన శుభకుమార్. ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారి కూడా పనిచేశారు. ఆయన ఒక ఉన్నతాధికారి సాయంతో జగన్‌ని కలిసి థర్డ్ లిస్టులో మడకశిర కేండెట్‌గా పేరు ఖరారు చేయించుకోగలిగారు. అయితే కర్ణాటక లాబీయింగ్ పనిచేయడంతో. నాలుగో జాబితాతో శుభకుమార్ ఆశలు ఆవిరయ్యాయంట.

ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ .. ఆమె గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా పనిచేశారు. హిందూపురం సిట్టింగ్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తేడా ఆరోపణలు రావడంతో ఆయన్ని పక్కన పెట్టేసిన జగన్.. కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీని హిందూపురం తీసుకొచ్చేశారు. ఆమె మైనింగ్‌కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కర్ణాటక మాజీ మంత్రి బళ్ళారి శ్రీరాములుకు స్వయానా సోదరి అవ్వడం గమనార్హం. ఆమె తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిన 3 గంటల్లోనే ఎంపీ టికెట్ దక్కించుకని అందరికీషాక్ ఇచ్చింది.

అనంతపురం జిల్లాలోనే కాక రాయలసీమలోని వివిధ సెగ్మెంట్ల రాజకీయాల్లో కూడా కర్నాటక బడాబాబుల పెత్తనం కొనసాగుతోందంటున్నారు. కర్ణాటక నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కి ఫోన్ వస్తే టికెట్ కన్‌ఫర్మ్ అయినట్లే అని వైసీపీ నేతలే అంటున్నారు. అందుకే ఇంకా సీమలో ప్రకటించాల్సిన స్థానాలు పెండింగ్ ఉండటంతో .. కర్ణాటక నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పాట్లు పడుతున్నారట వైసీపీ నాయకులు. అలా సాగిపోతోంది కర్ణాటకతో తాడేపల్లి అనుబంధం.

Gali Janardhan Reddy, effect, YSRCP, Jagan, Election ticket, AP Elections, Karnataka, Mining Mafia, Hindupuram,

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×