EPAPER
Kirrak Couples Episode 1

MLC: పొలిటికల్ ‘చిరంజీవి’.. కోచింగ్‌సెంటర్ నుంచి ‘కౌన్సిల్’ వరకు..

MLC: పొలిటికల్ ‘చిరంజీవి’.. కోచింగ్‌సెంటర్ నుంచి ‘కౌన్సిల్’ వరకు..

MLC: చిరంజీవి తెలుసా? మెగాస్టార్ చిరు కాదు. చిరంజీవి సార్ తెలుసా? చాలామంది తెలీదనే చెబుతారు. ఇదే ప్రశ్న కోచింగ్‌సెంటర్లకు కేంద్రమైన హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ సెంటర్లో అడిగితే.. చిరంజీవి సార్ అంటే తెలీని వారు ఒక్కరు కూడా ఉండనే ఉండరు. అంత ఫేమస్ ఆయన. విశాఖ బ్రాంచ్‌లోనూ టీచ్ చేస్తున్నారు. సివిల్స్, గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌కి కీలకమైన, క్లిష్టమైన ‘ఎకానమి’ (ఆర్థికశాస్త్రం) సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ కావడంతో చిరంజీవికి నిరుద్యోగుల్లో ఫుల్ పాపులారిటీ. ఎకానమీపై పుస్తకాలూ రాశారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో.. చిరంజీవి సార్ కూడా అంతే ఫేమస్ అయ్యారు.


కట్ చేస్తే.. ఆ ఎకానమీ సార్ చిరంజీవినే.. ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. వైసీపీకి గట్టి షాకిచ్చారు.

చిరంజీవికి అంచనాలకు మించి తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. అయినా, గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ కేండిడేట్ అయిన మాధవ్.. నాలుగో స్థానానికి పడిపోయారు. చిరంజీవి గెలుపు కోసం.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక సమయంలో యాక్టివ్ అయి.. చక్రం తిప్పారు. పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు.


టీచింగ్ లైన్లో ఉంటూనే.. సేవా కార్యక్రమాల్లో ముందుండే వారు. కొవిడ్‌ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేశారు. రోగులకు ఆర్థికసాయం చేశారు. ఏయూ పూర్వ విద్యార్థులతో కలిసి హుద్‌హుద్‌ తుపాను సమయంలో సేవలందించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ‘హెల్పింగ్‌ హ్యాండ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలువురికి ఆర్థిక సాయం అందించారు.

అనకాపల్లి జిల్లా దొండపూడిలో జన్మించిన వేపాడ చిరంజీవిరావు.. డిగ్రీ, బీఈడీ తర్వాత ఏయూ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. 1995లో ఏయూసెట్‌లో ఫస్ట్ ర్యాంక్‌ సాధించారు. 1996 డీఎస్సీలో ఎంపికై ఎస్‌జీటీగా చేరారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా 12 ఏళ్ల అనుభవం ఆయనది. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై 6 పుస్తకాలు రాశారు. చిరంజీవిరావు సేవలు గుర్తించి టీడీపీ అతన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది. అధికార వైసీపీకి షాక్ ఇస్తూ.. ఉత్తరాంధ్ర నుంచి సంచలన విజయం సాధించి.. ఏపీ శాసన మండలిలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి సార్.

Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Ysrcp: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

SIT Inquiry on Tirumala laddu: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

YS Jagan: బెడిసికొట్టిన జగన్ ప్లాన్.. అడ్డంగా దొరికాడు?

Posani: డర్టీ పాలిటిక్స్.. రంగంలోకి పోసాని, వైసీపీకి ఇక వాళ్లే దిక్కా?

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Big Stories

×